తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ను తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ 3లో విజేతగా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ శనివారంనాడు మాసబ్ ట్యాంకులోని పశు సంవర్ధక శాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. పాతబస్తీ యాసతో మాట్లాడే రాహుల్, మంచి సింగర్ కూడా. ఈ బేటీలో రాహుల్‌ను బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచినందుకు మంత్రి తలసాని అభినందించారు. తెలంగాణ ప్రభుత్వ సహకారం ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రీసెంట్గా ముగిసిన బిగ్‌బాస్ 3 ఫైనల్లో విజేతగా నిలిచిన రాహుల్ 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీ గెలుచుకున్నారు.