ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ రోబో 2.0 సినిమాతో 800కోట్లు కొల్లగోటి కోలీవుడ్ బాక్సాఫీస్ ముందెన్నడూ చూడని వసూళ్ల వర్షాన్ని కురిపించాడు. దాదాపు అన్ని ఏరియాల్లో లాభాల బాటలో నడిచిన ఈ సినిమా తెలుగు మాత్రం నష్టాలు మిగిలించింది. ఇది మరిపించడానికి రజినీకాంత్ ఈసారి రెండు నెలలు కూడా కాకముందే పేట సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.
సంక్రాంతి రేస్ లో నిలబడడానికి సిద్దమైన ఈ సినిమా జనవరి 10న విడుదల చేయబోతున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన పేట తెలుగు ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది కానీ బడా సినిమాలతో పోటీ ఉండగా, వాటిని తట్టుకొని నిలబడే సత్తా పేటకి ఉందా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఎంత రజినీ చరిష్మా కలిసినా కూడా సినిమాలో విషయం లేకపోతే ఆడదు అని చెప్పడానికి మన దగ్గర చాలా ఉదాహరణలే ఉన్నాయి.
నిజానికి ఒకప్పుడు సూపర్ స్టార్ సినిమా వస్తుంది అంటే అది డబ్బింగ్ మూవీ అయినా కూడా మన హీరోలు, రజినీ సినిమాకి పోటీగా వాళ్ల చిత్రాన్ని వదలడానికి భయపడే వారు. అయితే వరుస ఫ్లాప్స్ తో రజినీకాంత్ మార్కెట్ పూర్తిగా దెబ్బతింది, భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి కానీ అవి ఫుల్ రన్ మాత్రం ఉపయోగపడట్లేదు. అందుకే పేట సినిమా సంక్రాంతి రేస్ లో ఉన్నా కూడా రజినీ ఈసినిమాకి ఉండే ఆ సౌండ్ లేదు. ప్రొమోషన్స్ ని కనీసం మొక్కుబడి కోసం కూడా చెయ్యట్లేదు, కాబట్టి పేట ఒక మాములు సినిమాగానే ప్రేక్షకుల ముందుకి వస్తుంది కానీ రజినీ రేంజ్ సినిమాలాగే అనిపించట్లేదు. ఇలాంటి సమయంలో రజినీ బాక్సాఫీస్ దగ్గర మళ్లీ తన పాత రోజుల్ని గుర్తు చేయాలంటే పేట సినిమా పోటీలో నిలిచి, మంచి లాభాలని తెచ్చిపెట్టాలి.. అప్పుడే రజినీ రేంజ్ తెలుస్తుంది, అప్పటి వరకూ సూపర్ స్టార్ నుంచి తెలుగులో పెద్దగా సౌండ్ లేనట్లే.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!