NTR: మరికొన్ని రోజులలో సినిమా విడుదలవ్వుతున్న సందర్భంగా జూనియర్ NTR ‘RRR’ ప్రమోషన్లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసినదే. ఇకపోతే ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని కొరటాల శివతో ప్రకటించిన సంగతి తెలిసిందే. నందమూరి తారకరామారావు ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. కళ్యాణ్ రామ్ సమర్పకుడిగా వ్యవహరించబోతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కబోయే ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది.
NTR: హద్దులు దాటుతున్న అభిమానం..అమెరికాలో మరో సంచలన నిర్ణయం..
NTR: తాజా అప్ డేట్ ఇదే..
తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ మూవీ ద్వారా సీనియర్ స్టార్ హీరోయిన్ అయినటువంటి సోనాలి బింద్రే రీ ఎంట్రీ ఇవ్వనున్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. బాలీవుడ్లో కెరీర్ స్టార్ట్ చేసి 2 ఏళ్లలోనే బిజీ హీరోయిన్గా మారిపోయింది. తరువాత మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘మురారి’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, ఇంద్ర, శంకర్ దాదా MBBS, ఖడ్గం, మన్మథుడు వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది.
NTR – Bucchibabu: ఎన్టీఆర్ త్వరలో క్రేజీ ప్రాజెక్ట్ విషయంలో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడా..!
ముఖ్య సమాచారం:
అనారోగ్యం కారణంగా చాలా సంవత్సరాలు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సోనాలి, ఇటీవలె హిందీలో ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్’ అనే ఓ రియాలిటీ షో ద్వారా మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. ఇక ఇన్నాళ్ళకి NTR 30వ చిత్రంలో ఆమె అవకాశం దక్కించుకున్నట్లు, NTRకి అక్క పాత్రలో నటించబోతోందని.. అంటున్నారు. అయితే ఈ విషయమై ఇంకా మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!