బాలీవుడ్లో అమితాబ్.. కోలీవుడ్లో రజినీ.. మేరు నగధీరులుగా చిత్రపరిశ్రమ కొనియాడుతుంటుంది. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి వల్లమాలిన అభిమానం. ఈ విషయాన్ని పలు వేదికలపై ఈ ఇద్దరు లెజెండ్స్ పంచుకున్నారు. తాజాగా రజినీ తన అభిమాన నటుడి గురించి ఓ విషయం చెప్పారు. ముంబైలో సోమవారం జరిగిన ‘దర్బార్’ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా రజినీ మాట్లాడుతూ.. బిగ్ బీ అంటే తనకు స్ఫూర్తి అని చెప్పారు. కెమేరా ముందే కాదు.. కెమేరా వెనక కూడా ఆయన నాకు మార్గదర్శి అన్నారు. అయితే అమితాబ్ చేసిన ఓ సూచనను తాను పాటించలేకపోతున్నానని పలికారు. ‘‘60 ఏళ్ల వయస్సులో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అమితాబ్ నాతో చెప్పారు. తరుచూ వ్యాయామం చేయడం, ఎప్పుడూ ఏదో ఒక పని చేతిలో ఉండేలా చూసుకోవడం, రాజకీయాలకు దూరంగా ఉండాలన్నారు. కానీ మూడో దాన్ని పాటించలేకపోతున్నా’’ అన్నారు.
రాజకీయాల్లో రానున్నట్టు రెండేళ్ల క్రితమే రజినీ ప్రకటించారు. ప్రజా జీవితంలోకి రావాలన్న తన ఆలోచనను అభిమానులతో పంచుకున్నారు. అయితే రజినీ ఇప్పటి వరకు పార్టీ పేరు ప్రకటించలేదు. రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ఆయన గతంలో తెలిపిన విషయం తెలిసిందే.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!