Brahmamudi appu: ఒక టాలీవుడ్ ఇండస్ట్రీలో అనే కాకుండా అనేక ఇండస్ట్రీలలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ప్రస్తుత కాలంలో చాలా కామన్ గా మారిపోయింది. అనేక స్టార్ హీరోయిన్స్ తమ ఆవేదనను బయటపెడుతున్నప్పటికీ ఈ కాస్టింగ్ కౌచ్ మాత్రం ఆగడం లేదు. ఇక ఈ కాస్టింగ్ కౌచ్ ఒక సినిమా ఇండస్ట్రీ వారికే అని ఇప్పటివరకు మనందరం అనుకున్నాం. కానీ అది అబద్ధం. ప్రస్తుతం బుల్లితెర వారికి కూడా ఈ టార్చర్ ఎదురవుతుంది.
ఇక తాజాగా తన ఆవేదనను బయట పెడుతూ ఓ బుల్లితెర నటి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె మరెవ్వరో కాదు బ్రహ్మముడి సీరియల్ తో మంచి ఫేమస్ అయిన అప్పు అలియాస్ వైనిషా రాయ్. ఈ ముద్దుగుమ్మ ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాలను బయటపెట్టింది. ఈమె మాట్లాడుతూ..” మా ఇంట్లో యాంకర్ అవుతానంటే ఒప్పుకోలేదు. నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించేశారు. నటన మీద ఇష్టంతో ఇంటి నుంచి బయటకు వచ్చేసాను. ఆ తరువాత వెనక్కి తిరిగి వెళ్లలేక ఓ చోట డబ్బులు ఇస్తానన్నారని తెలిసి రక్తం డొనేట్ చేశాను.
ఈ క్రమంలో ఆఫర్స్ కోసం కొంతమంది దగ్గరకు వెళ్తే.. నీకు ఆఫర్ ఇస్తే నాకేంటి లాభం? అని అడిగారు. మరికొందరు ఆఫర్ ఇచ్చాక కమిట్మెంట్ అడగడం స్టార్ట్ చేశారు. షూటింగ్ మొదలవుతుండగా నన్ను బలవంతం చేయడంతో కొట్టి తప్పించుకుని వచ్చేసాను. అనంతరం తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా కానీ నా తల్లిదండ్రులు ఆదరిస్తారో లేదో అని ఆగిపోయాను. దీంతో పలుమార్లు సూసైడ్ అటెండ్ కూడా ప్రయోగించ.
అనంతరం ధైర్యంతో ముందడుగు వేసి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్న ” అంటూ వెల్లడించింది వైనిషా రాయ్. ఈ ముద్దుగుమ్మ వ్యాఖ్యలు విన్న ప్రేక్షకులు..” నేటి తరంలో తల్లిదండ్రులు కూడా అలా ఉన్నారు మరి. సినిమా ఇండస్ట్రీ లోకి వెళతా అంటేనే ఇంట్లో నుంచి పంపించేయాలా? అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలోకి ప్రస్తుత జనరేషన్ అమ్మాయిలు రావాలంటే క్యాస్టింగ్ కౌచ్తో చాలా బాధపడుతున్నారు. సినీ హీరోలు అనేక మోటివేషన్ కొటేషన్లు చెప్పడం కాదు ముందు దీనిని అరికట్టండి ” అంటూ ఫైర్ అవుతున్నారు.