Vijay Deverakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న కుర్ర హీరోలలో విజయ్ దేవరకొండ మంచి జోరుమీద ఉన్న సంగతి తెలిసిందే. “అర్జున్ రెడ్డి”తో ఓవర్ నైట్ లో తిరుగులేని క్రేజ్ దక్కించుకున్న విజయ్ “గీతాగోవిందం” సినిమాతో అమ్మాయిలలో మరింత ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలు వచ్చినా కానీ.. గత కొద్ది సంవత్సరాల నుండి వరుసపెట్టి ప్లాపులు మనోడికి పడుతున్నాయి. దీంతో విజయ్ దేవరకొండ డౌన్ ఫాల్ కోసం ఎదురుచూస్తున్న వాళ్లు సోషల్ మీడియాలో భారీగా ట్రోల్ చేయడం జరిగింది. ఆ తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “లైగర్” అనే పాన్ ఇండియా సినిమా చేయటం తెలిసిందే.ఈ సినిమా ఆగస్టు నెలలో విడుదల కానుంది. ఈ సినిమాలో అంతర్జాతీయ బాక్సర్ గా విజయ్ దేవరకొండ కనిపిస్తున్నాడు. అంత మాత్రమే కాదు ఈ సినిమాలో వరల్డ్ వైడ్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైశాన్ కూడా నటించడం జరిగింది. “లైగర్” పై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు లైగార్ తర్వాత మరికొన్ని సినిమాల షూటింగులు.. విజయ్ దేవరకొండ స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ ప్రాజెక్టు ఒప్పుకోవటం తెలిసిందే.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ పాత్రలో సమంత నటిస్తోంది. అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఆర్మీ పోలీస్ అధికారిగా కనిపిస్తున్నాడు అని అంటున్నారు. ఇక ఇదే సమయంలో సమంత కాశ్మీరీ అమ్మాయి గా నటిస్తూందట. రొమాంటిక్ నేపథ్యంలో శివ నిర్వాణ ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఈ విషయం పక్కన పెడితే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మరో సినిమా విజయ్ దేవరకొండ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో కూడా ఆర్మీ జవాన్ పాత్రలో కనిపించడం విశేషం. ఈ రెండు సినిమాల షూటింగులు ఒకేసారి విజయ్ దేవరకొండ చేయనున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!