Nagarjuna : నాగార్జున బంగార్రాజు సినిమాలో నటిస్తున్నాడు. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా గురించి ఎలాంటి అఫీషియల్ న్యూస్ రాలేదు. కానీ విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో మొదలై శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇక బంగార్రాజు సూపర్ హిట్ సినిమా సోగ్గాడే చిన్ని నాయన సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో నాగార్జున అద్భుతమైన సక్సస్ ఇచ్చిన కళ్యాణ్ కృష్ణ కే బంగార్రాజు దర్శకత్వం వహించే బాధ్యత అప్పగించాడు.
కళ్యాణ్ కృష్ణ కూడా నాగార్జున తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని 100 కి 100 శాతం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అద్భుతమైన కథ తో బంగార్రాజు ని తెరకెక్కిస్తున్నాడని సమాచారం. ఇక నాగార్జున కూడా బంగార్రాజు సినిమా విషయంలో సర్ప్రైజ్ ఇవ్వాలన్న కారణంగానే ఈ సినిమాకి సంబంధించిన విషయాలను సీక్రెట్ గా ఉంచినట్టు తెలుస్తోంది. అయితే ఒక న్యూస్ మాత్రం అందరికీ షాకింగ్ గా అనిపిస్తోంది. అదే ఈ సినిమాలో నాగ చైతన్య ఉన్నాడా లేడా అని. సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో నాగార్జున తండ్రీ కొడులుగా ద్విపాత్రాభినయంలో అదరగొట్టాడు.
Nagarjuna : నాగార్జున – నాగ చైతన్య ఒకే ఫ్రేం లో కనిపిస్తే అక్కినేని అభిమానులకి పూనకమే..!
అయితే ఈ సీక్వెల్ లో రియల్ లైఫ్ లో తండ్రీ కొడుకులైన నాగార్జున – నాగా చైతన్య నటించేలా కళ్యాణ్ కృష్ణ మల్టీస్టారర్ కథ ని తెరకెక్కిస్తున్నాడట. నాగార్జున – నాగ చైతన్య ఒకే ఫ్రేం లో కనిపిస్తే అక్కినేని అభిమానులకి పూనకమే అంటున్నారు. చూడాలి మరి మనం తర్వాత మళ్ళీ ఇంతకాలానికి నాగార్జున – నాగ చైతన్య కలిసి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక రమ్యకృష్ణ నాగార్జున కి జంటగా నటిస్తుండగా చైతూ కి జంటగా నటించే హీరోయిన్ ఎవరన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నాగచైతన్య ‘థ్యాంక్యూ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా చిత్రీకరణ కొన్ని వారాల క్రితమే ప్రారంభం అయ్యింది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోంది. దిల్ రాజు నిర్మాత.