NewsOrbit
న్యూస్

నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన… జగన్ వింటారా?

ప్రస్తుతం కరోనా కొట్టిన దెబ్బతో దేశ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైపోయిందని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రభావం గరిష్టంగా రెండేళ్ల పాటు ఉంటుందని ఆర్ధిక నిపుణులు చెబుతున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ జాగ్రత్తల పేరుమీద పథకాలు ఆపేసే పరిస్థితికి వచ్చింది! ఈ పరిస్థితుల్లో తాజాగా కేంద్ర ఆర్ధిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. “ఇకపై కేంద్రం నుంచి కొత్త పధకాలు ఏవీ ఉండవు. కనీసం ఒక ఏడాది పాటు ఇదే నిషేధం కొనసాగుతుంది” అని క్లారిటీ ఇచ్చారు. ఇదే సమయంలో రాష్ట్రాలనుంచి కొత్త ప్రతిపాదనలు కూడా ప్రస్తుతానికి ఏమీ పంపొద్దని సూచించారు. మరి ఈ పరిస్థితుల్లో ఏపీ పరిస్థితి ఏమిటి?

కేంద్రప్రభుత్వమే ఇలా చేతులెత్తేసి కొత్త పధకాలు వద్దు అంటోన్న సమయంలో… ఏపీ పరిస్థితి ఏమిటి? నిర్మలా సీతారమన్ ప్రకటన చూస్తే.. ఇక ఏపీకి కేంద్రం నుంచి వచ్చే సాయంపై ఇప్పట్లో ఆశలు పెట్టుకోలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో సంక్షేమ పథకాల విషయంలో దూకుపోతున్న ఏపీ సర్కార్ కి ఇది మామూలు అగ్నిపరీక్ష కాదు. ఎందుకంటే… సుమారు ఆరేళ్ళుగా స్థిరమైన ఆదాయం లేని ఏపీ… బడ్జెట్ మొత్తంలో సంక్షేమానికి నూటికి ఎనభై రూపాయలు ఖర్చు చేస్తున్న పరిస్థితి. మరి ఈ విషయంలో జగన్ సర్కార్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది!

అయితే… పరిస్థితులు ఎలా ఉన్నా సంక్షేమం విషయంలో, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించే విషయంలో జగన్ తగ్గరనే అంటున్నారు వైకాపా నాయకులు! ఇప్పటికే చెప్పినవీ, చెప్పనివీ అన్నీ కలుపుకుని అనేక హామీలు తీర్చేసిన జగన్… తొలి ఏడాదిలోనే యాభైవేల కోట్ల రూపాయలు నేరుగా జనాల ఖాతాల్లో వేసిన పరిస్థితి. ఈ క్రమంలో ఇది ఇలానే కొనసాగితే చాలా ఇబ్బందే అనేవారున్నారు. దీన్ని ఇలా కొనసాగించినా పర్లేదు కానీ… కనీసం కొత్త పథకాలు అయినా ప్రవేశపెట్టకుండా కొంతకాలం ఆగాలని మరో విన్నపం. మరి ఈ విషయంలో జగన్ ఈ మాటలు వింటారా? చూడాలి మరి!

Related posts

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?