NewsOrbit
Featured న్యూస్

ఆధార్ లో మార్పుల‌కు ఇక‌పై రూ.100 ఫీజు చెల్లించాల్సిందే..

కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అందిస్తున్న అనేక ప‌థ‌కాల‌ను పొందాలంటే ప్ర‌తి ఒక్క‌రికీ ఆధార్ త‌ప్ప‌నిస‌రిగా ఉందాల్సిందేన‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. వీటికే కాక బ్యాంకింగ్ లావాదేవీల‌కు, పాన్ కార్డుకు, ఇత‌ర ప‌నుల‌కు కూడా ఆధార్‌ను త‌ప్ప‌నిస‌రి చేశారు. అయితే ఇందుకుగాను ఆధార్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేటెడ్‌గా ఉంచుకోవ‌డం అనివార్య‌మైంది. ఈ క్ర‌మంలో చాలా మంది ఎప్ప‌టిక‌ప్పుడు ఆధార్ లో మార్పులు, చేర్పులు చేయించుకుంటుంటారు. అయితే ఇక‌పై ఆ మార్పుల‌కు గాను రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేర‌కు UIDAI తాజాగా ట్వీట్ చేసింది.

now you have to pay rs 100 for making changes in aadhar

ఆధార్‌లో ఇక‌పై మార్పులు చేయించుకోవాల‌నుకుంటే రూ.100 ఫీజు చెల్లించాలి. అదే కేవ‌లం డెమొగ్రాఫిక్ వివ‌రాలు అప్ డేట్ చేయిస్తే రూ.50 ఫీజు ఇవ్వాలి. ఇత‌ర ఏ వివ‌రాల‌ను అయినా స‌రే మారిస్తే రూ.100 ఫీజును ఆధార్ సేవా కేంద్రాల్లో చెల్లించాలి. ఇక ప్ర‌జ‌లు త‌మ పేరు, చిరునామా, పుట్టిన తేదీ తదిత‌ర వివ‌రాల‌ను మారిస్తే అందుకు డాక్యుమెంట్లు అవ‌స‌రం అవుతాయి. UIDAI ప్ర‌స్తుతం 32 ర‌కాల డాక్యుమెంట్ల‌ను ఐడీ ప్రూఫ్ కింద తీసుకుంటోంది. అలాగే 45 ర‌కాల డాక్యుమెంట్ల‌ను అడ్ర‌స్ ప్రూఫ్ కింద‌, 15 ర‌కాల డాక్యుమెంట్ల‌ను పుట్టిన తేదీ ప్రూఫ్ కింద స్వీక‌రిస్తోంది. వాటిని స‌మ‌ర్పించి ఆయా వివ‌రాల‌ను ఆధార్‌లో మార్చుకోవ‌చ్చు.

ఇక ఫొటో, బ‌యోమెట్రిక్స్‌, లింగం, మెయిల్ ఐడీ, మొబైల్ నంబ‌ర్ వివ‌రాల‌ను మార్చేందుకు ఎలాంటి ప్రూఫ్‌లు అవ‌స‌రం లేదు. ప‌లు ఆధార్ సేవా కేంద్రాల్లో ముందుగానే అపాయింట్‌మెంట్‌ను బుక్ చేసుకునే స‌దుపాయం క‌ల్పిస్తున్నారు. అందువ‌ల్ల అపాయింట్‌మెంట్ బుక్ చేసుకుని టైముకు వెళ్లి ఆధార్ లో ఆయా వివ‌రాల‌ను మార్చుకోవ‌చ్చు. అయితే ఆధార్‌లో పేరును కేవ‌లం 2 సార్లు మాత్ర‌మే మార్చుకోవ‌చ్చు. అలాగే పుట్టిన తేదీ, లింగంల‌ను ఒక్క‌సారి మాత్ర‌మే మార్చుకునేందుకు వీలు క‌ల్పించారు.

author avatar
Srikanth A

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju