వన్‌ప్లస్ కంపెనీ వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో 6.44 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేను ఇచ్చారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. అందువల్ల దీంతో గేమ్స్‌ను స్మూత్‌గా ఆడుకోవచ్చు. ఫోన్‌కు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఇచ్చారు. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 765జి ప్రాసెసర్ ఉన్నందున 5జికి సపోర్ట్‌ను ఇస్తుంది. ఫోన్ 6, 8, 12 జీబీ ర్యామ్ ఆప్షన్లలో విడుదలైంది.
వన్‌ప్లస్ నార్డ్ ఫోన్లో 64, 128, 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్లను ఇచ్చారు. ఆండ్రాయిడ్ 10 ఓఎస్ ఉంది. డ్యుయల్ సిమ్ మాత్రమే వేసుకోవచ్చు. మెమొరీ కార్డు స్లాట్ లేదు. వెనుకవైపు 48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాతోపాటు 8, 5, 2 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న మరో 3 కెమెరాలు ఉన్నాయి. ముందు వైపు 32 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాతోపాటు మరో 8 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. ఫోన్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.
యూఎస్బీ టైప్ సి పోర్టును ఇచ్చారు. 5జికి సపోర్ట్ ఉంది. 4జి సిమ్‌లను రెండింటిని ఏకకాలంలో వాడుకోవచ్చు. 4115 ఎంఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ ఉంది. దీంతో ఫోన్ కేవలం 22 నిమిషాల్లోనే 0 నుంచి 70 శాతం వరకు చార్జింగ్ అవుతుంది.
వన్‌ప్లస్ నార్డ్ ఫోన్ వివిధ ర్యామ్, స్టోరేజ్ మోడల్స్ ధరలు ఇలా ఉన్నాయి.
* 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.24,999
* 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.27,999
* 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.29,999
ఆగస్టు 4 నుంచి అమెజాన్, వన్‌ప్లస్ వెబ్సైట్లలో వన్‌ప్లస్ నార్డ్ ఫోన్‌ను కొనవచ్చు. ఎంట్రీ లెవల్ 6జీబీ ర్యామ్ మోడల్ మాత్రం సెప్టెంబర్‌లో లభిస్తుంది.