2023 Oscars: రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం RRR. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకొని ఏకంగా ఆస్కార్ నామినేషన్ లో కూడా నిలిచింది. ఇలా ఈ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్లో నిలవడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకే ఈ పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా అందుకున్న విషయం మనకు తెలిసిందే. కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్ లో ఆస్కార్ నామినేషన్లు ప్రకటించారు. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి కేటగిరీల్లో తుది నామినేషన్లు పొందిన వారి వివరాలు వెల్లడించారు. కాగా ఈ ఆస్కార్ నామినేషన్స్ లో ఉత్తమ నటి కేటగిరీలో ఆండ్రియా రైజ్ బరో నిలుస్తానని ఊహించలేదట..

ఉత్తమ నటుడు కేటగిరీ…
పాల్ మెస్కల్ (ఆఫ్టర్ సన్)
బిల్ నైయీ (లివింగ్)
బ్రెండన్ ఫ్రేజర్ (ద వేల్)
ఆస్టిన్ బట్లర్ (ఎల్విస్)
కొలిన్ ఫారెల్ (ద బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్)
ఉత్తమ నటి కేటగిరీ…
కేట్ బ్లాంచెట్ (టార్)
మిచెల్లీ యో (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్)
ఆండ్రియా రైజ్ బరో (ట లెస్లీ)
అనా డి అర్మాస్ (బ్లాండే)
మిచెల్లీ విలియమ్స్ (ద ఫేబుల్ మాన్స్)
2023 ఆస్కాకు ఎంపికైన వారిని అకాడమీ వారి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకోగా.. ఉత్తమ నటి కేటగిరీలో ఆండ్రియా రైజ్ బరో జ్ బరో “టో లెస్లీ” అనే చిత్రంలో.. ఓ మద్యపాన ఒంటరి తల్లిని పాత్రలో నటించిన ఆండ్రియా రైజ్ బరో ఉత్తమ నటిగా ఎంపికైంది.. ఈ మేరకు ఆమె అభిప్రాయాన్ని అడిగా అకాడమీ వారు తెలుసుకోగా ఆస్కార్ రేసులో ఉత్తమ నదిగా నేను నిలుస్తానని ఆమె అసలు ఊహించలేదని సమాధానం తెలుపగా.. ఆ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.