Categories: న్యూస్

Pension : పెన్షన్లు తీసుకునే ప్రతీ ఒక్కరికీ సూపర్ గుడ్ న్యూస్ !

Share

Pension: వయసుపైబడిన తర్వాత పదవీ విరమణ చెందిన చాలా మందికి పెన్షన్ ఆసరాగా నిలుస్తోంది. నెల నెలా అందే ఈ పింఛన్ వల్లే వృద్ధులు ఒకరిపై ఆధారపడకుండా తమ జీవితాన్ని సాగిస్తున్నారు. అయితే నిరంతరాయంగా పింఛన్ పొందాలంటే ప్రతి ఏటా పింఛనుదారులు లైఫ్ సర్టిఫికెట్ (Life Certificate) సమర్పించాల్సి ఉంటుంది. సాధారణంగా ఒక సంవత్సరంలో నవంబర్ 1 నుంచి నవంబర్ 30 తేదీలోగా బ్యాంకు లేదా పెన్షన్ ఏజెన్సీకి జీవన ప్రమాణ పత్రం సబ్‌మిట్‌ చేయాల్సి ఉంటుంది. అయితే ఈసారి కరోనా (corona) కారణంగా చాలామంది వృద్ధులు బయటకు వెళ్లలేకపోయారు. దీంతో లైఫ్ సర్టిఫికెట్ సబ్‌మిషన్ గడువును కేంద్రం 30 రోజుల పెంచుతూ డిసెంబర్ 31, 2021 వరకు అవకాశాన్ని ఇచ్చింది. అయితే మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొందరు ఇంకా జీవన ప్రమాణ్ పత్రాన్ని సమర్పించలేకపోయారు. దీంతో మరోసారి ఈ గడువు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. అలాగే ఇందుకు ఓ సరికొత్త డిజిటల్ పద్ధతిని తీసుకొచ్చింది.

Pension: ప్రతీ పెన్షనర్‌కు గుడ్ న్యూస్ !

తాజాగా పెన్షన్ & పెన్షనర్ల సంక్షేమ శాఖ జీవన ప్రమాణ పత్రం సబ్‌మిషన్ లేదా సమర్పించే తుది గడువును ఫిబ్రవరి 28, 2022 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో వృద్ధులకు దాదాపు రెండు నెలల సమయం లభించిందనే చెప్పాలి. ఈ ఫిబ్రవరి 28 డెడ్ లైన్ లోగా వృద్ధులు తమ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించి పెన్షన్ పొందవచ్చు.

అసలైన సూపర్ గుడ్‌న్యూస్‌ ఇదే!

ప్రస్తుత పరిస్థితుల్లో బయటికి వెళ్లడం అంత సురక్షితం కాదు కాబట్టి ఈజీగా జీవన ప్రమాణ పత్రం సమర్పించేందుకు ఫేస్ రికగ్నిషన్ (Face Recognition) టెక్నాలజీని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనివల్ల కోట్లాది మంది పెన్షనర్లు మొబైల్ యాప్ వాడుతూ సులభంగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించవచ్చు. చాలామంది వృద్ధులు ఫింగర్‌ప్రింట్స్ ని కరెక్ట్ గా సమర్పించలేరు. అందుకే ఈ ఫేస్ రికగ్నిషన్ సౌకర్యం ప్రారంభించామని తెలుపుతోంది కేంద్రం.

ఈ యాప్‌తో లైఫ్ సర్టిఫికెట్ సబ్మిషన్ చాలా ఈజీ..!

ఫేస్ రికగ్నిషన్ తో ఫేస్ ఐడీ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్, పెన్షన్ పంపిణీ చేసే సంస్థతో రిజిస్టర్ అయిన ఆధార్ నంబర్, 5Mp రిజల్యూషన్ లేదా అంతకంటే ఎక్కువ ఎంపీ కెమెరా గల స్మార్ట్‌ఫోన్ ఉండాలి. తరువాత AadhaarFaceID అనే యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. లేదా ఫేస్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేయడానికి https://jeevanpramaan.gov.in/ని విజిట్ చేయండి. ఆపై అప్లికేషన్‌లో తగిన పర్మిషన్స్ ఇచ్చాక.. ఆథరైజేషన్‌ పూర్తి చేసి, మీ ఫేస్ స్కాన్ చేయండి. ఇప్పుడు ఇప్పుడు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేందుకు, పెన్షనర్ ఆథరైజేషన్‌ కోసం మీ సమాచారాన్ని పూరించండి. ఆపై మీ లైవ్ ఫొటోను స్కాన్ చేయండి. అంతే విజయవంతంగా జీవన ప్రమాణ్ పత్రం సమర్పించినట్లు అవుతుంది.


Share

Recent Posts

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

38 నిమిషాలు ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

1 గంట ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

3 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

4 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

4 గంటలు ago

గోమాతకు ఏ ఆహార పదార్థాలను తీసుకుని ఎటువంటి ఫలితాలు వస్తాయంటే.!?

ఆవు :హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనది అన్న విషయం అందరికీ తెలిసినదే.. గోవు ను హిందువులు గోమాతగా భావించి పూజలు చేస్తారు.. కనుకనే గోమాతను దైవంగా భావిస్తారు. పురాణాల…

4 గంటలు ago