NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

PM Modi: తెలంగాణ సీఎం కేసీఆర్ పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

Share

PM Modi: నిజామాబాద్ సభా వేదికగా తెలంగాణ సీఎం కేసిఆర్ పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజల నుండి దోచుకున్న సొమ్మును కేసిఆర్ .. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కు అందించారని సంచలన ఆరోపణలు చేశారు. ఎన్డీఏలో చేరతానని సీఎం కేసిఆర్ వెంటపడ్డారనీ కానీ ఆ ప్రతిపాదనను తాను ఒప్పుకోలేదని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేసిఆర్ ఢిల్లీకి వచ్చిన కలిశారనీ, తెలంగాణ పాలన పగ్గాలు మంత్రి కేటిఆర్ కు ఇస్తానని చెప్పి కేటిఆర్ ను ఆశీర్వదించాలని కోరారన్నారు. ఇది రాజరికం కాదు, ప్రజాస్వామ్యమని కేసిఆర్ తో అన్నాననీ, ప్రజలు ఆశీర్వదిస్తేనే పాలకులు అవుతారని చెప్పానని అన్నారు.

బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోబోమని కేసిఆర్ కు తెల్చి చెప్పాననీ, అప్పటి నుండి తన కళ్లలోకి చూడ్డానికి కూడా సీఎం కేసిఆర్ భయపడుతున్నారని అన్నారు. కేసిఆర్ గతంలో అప్యాయంగా ఉన్నారనీ, హైదరాబాద్ వచ్చినప్పుడు ఆర్భాటంగా స్వాగతం పలికాడనీ, ఇప్పుడేమైందని ప్రశ్నించారు. తమ అవసరం తీరాక ఆయన ప్రవర్తన మారిందని విమర్శించారు. తమ కార్యకర్తలను ఎన్ని రకాలుగా వేధించినా భయపడేది లేదన్నారు. తెలంగాణ ఎంతో మంది బలిదానాలతోనే సాకారమైందన్నారు. ఇప్పుడు తెలంగాణ ను ఓ కుటుంబం దోచుకుంటోందని విమర్శించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక కుటుంబమే బాగుపడిందని అన్నారు. కేసిఆర్ పాలనలో అవినీతి పెరిగిందని అన్నారు. కేసిఆర్, ఆయన కుమారుడు, ఆయన కుమార్తె, అల్లుడు మాత్రమే ధనికులు అయ్యారని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నిధులను కూడా బీఆర్ఎస్ దోచుకుంటోందన్నారు.

కుటుంబ పాలనకు ప్రజలు మరో అవకాశం ఇవ్వొద్దన్నారు. నమ్మకం ఉంచి టీ బీజేపీకి అవకాశం ఇస్తే బీఆర్ఎస్ చోదుకున్నదంతా కక్కిస్తామని మోడీ పేర్కొన్నారు. ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తిని తెలంగాణకే వినియోగిస్తున్నామన్నారు. రైల్వే, ఆరోగ్య పథకాలు తెలంగాణ ప్రజలకు అంకితం చేశామన్నారు. నిజామాబాద్ మహిళలు, రైతులు ఇచ్చిన అపురూప స్వాగతానికి ధన్యుడినని పేర్కొంటూ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికల్లో నారీ శక్తి చూపించాలన్నారు. మొన్న మహబూబ్ నగర్ లో రూ.13,500 కోట్ల అబివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ ఇవేళ రూ.8వేల కోట్ల కుపైగా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

బీఆర్ఎస్, బీజేపీ మద్య రహస్య బంధం ఉందని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే గతంలో బీజేపీలో చేరాలనుకున్న పలువురు నేతలు సైతం కర్ణాటక ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ లో చేరికలు చాలా వరకు తగ్గాయి. కేసిఆర్ సర్కార్  పై దూకుడుగా విమర్శలు చేస్తూ రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న బండి సంజయ్ ను అధ్యక్ష బాధ్యతల నుండి అర్దాంతరంగా తప్పించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించడంతో ఆ ప్రచారానికి మరింత బలం చేకూరింది. దీంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా బీఆర్ఎస్ తో తమకు ఎటువంటి మితృత్వం లేదన్నట్లుగా కేసిఆర్ సర్కార్ పై తీవ్ర స్థాయి మోడీ విమర్శలు చేశారనే మాట వినబడుతోంది.

Nara Lokesh: ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేష్ కు ఊరట .. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ విచారణను వాయిదా వేసిన హైకోర్టు


Share

Related posts

RamaRao: ఇద్దరు భామలతో చిందేయనున్న “రామారావు”..!!

bharani jella

Venkatesh : బ్లాక్ బస్టర్ మలయాళం సినిమా దృశ్యం 2 – తెలుగు లో సెకండ్ పార్ట్ వచ్చేస్తోంది . వెంకటేష్ ఫ్యాన్స్ రెడీనా ?

bharani jella

T Congress: టీ కాంగ్రెస్ లో నయా ట్రెండ్ ..! మార్పునకు ఇది సంకేతం..?

somaraju sharma