Omicron BF 7: చైనాతో సహా పలు దేశాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తమైయ్యాయి. కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్ 7 వేగంగా వ్యాప్తి చెందుతుండటం ఆందోళనకు గురి చేస్తొంది. చైనాలో కేసులు పెరగడంతో భారత్ లో కేంద్రం ముందస్తు జాగ్రత్త చర్యలను తీవ్రతరం చేసింది. ప్రజలు వైరస్ నుండి సురక్షితంగా ఉండేలా , నివారణ చర్యలు పాటించాలని ప్రధాన మంత్రి మోడీ కోరారు. ఇవేళ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోడీ .. కరోనా పెరుగుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు.

చాలా దేశాల్లో కరోనా కేసులు పెరిగిపోతుండటాన్ని చూస్తున్నామనీ, ఈ నేపథ్యంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని మోడీ సూచించారు. ప్రజలు మాస్క్ లు ధరించడంతో పాటు ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలని తెలిపారు. ఈ నెల 27వ తేదీ (మంగళవారం) నుండి ఆరోగ్య సదుపాయల సన్నద్దతను తెలుసుకునేందుకు మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలను కోరింది. ఒక్క సారిగా కేసులు పెరిగితే రోగులకు చికిత్స అందించేందుకు వీలుగా సదుపాయాలను సిద్దం చేసుకోవాలని సూచించింది. అదే విధంగా ఆసుపత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలని, లైఫ్ సపోర్టు యంత్రాల పని తీరును చెక్ చేసుకోవాలని తెలిపింది. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఆర్టీపీసిఆర్ పరీక్షలు తప్పనిసరి చేసింది. కేంద్రం ఆదేశాలతో ఇప్పటికే అన్ని ఎయిర్ పోర్టుల్లో ఇతర దేశాల నుండి వచ్చే ప్రయాణీకులకు కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తున్నారు.
Omicron Bf-7: కేంద్రం కీలక ఆదేశాలు.. ఇకపై వాళ్లకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి