NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

మళ్ళీ పబ్జీ నా..!? ఈ సారి కొత్తగా..! ఆ కథ చూద్దాం రండి..!!

 

 

రేయ్ బిడ్డ టైం దాటిపోతుంది అన్నం తినడాన్నికి రా….. అగు అమ్మ గేమ్ ఆడుతున్న, కొంచెం ఆగి తింటాను….. ఇది కొడుకుని అన్నం తినడానికి పిలిచినా తల్లి కి కొడుకు ఇచ్చిన సమాధానం. నిద్ర లేచిన దగ్గర నుండి కొంచెం సమయం దొరికితే చాలు మొబైల్స్ వాడుతున్నారు నేటి యువత. ఇంటర్ నెట్ వినియోగం అధికమైనప్పటీ నుండి స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగింది. అందులో భాగంగానే పిల్లలు, యువత ఆన్‌లైన్ గేమింగ్‌కు వ్యసనపరులవుతున్నారు.ఈ ఆటలలో మునిగిపోయి తిండి తినడం, నిద్రపోవడం వంటి విషయాల్ని కూడా మర్చిపోయారు, జీవితంలో ఎంతో ముఖ్యం అయినా చదువును కూడా నిర్లక్ష్యం చేసింది యువత. అయితే యువత ఎక్కువ గా ఆడిన ఆట మాత్రం ప్లేయర్ అన్‌నోన్స్ బ్యాటిల్‌ గ్రౌండ్స్’ సంక్షిప్త రూపమే “పబ్ జి”. ఈ ఆట తెలియని యువత ఉండరు అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అసలు ఈ ఆట గురించి ఇపుడు తెలుసుకుందాం.

 

పబ్ జి ఆట:
దక్షిణ కొరియా కి చెందిన పబ్‌జి కార్పొరేషన్, ఈ గేమింగ్ యాప్ ను 2017 లో విడుదల చేసింది. మొబైల్ లో యాప్ ను ఇన్స్టాల్ చేసి లాగిన్ అయ్యాక ఫేస్‌బుక్ లేదా మరేదైనా సోషల్ అకౌంట్‌తో లాగిన్ అయ్యాక ఆట మొదలుపెట్టవచ్చు. 8X8 కిలోమీటర్ల యుద్ధ భూమిలో పలు భవనాలు, శిథిలాలు, వాహనాలు, ఆయుధాలు, ఇతర ప్లేయర్స్ ఉంటారు. విమానం నుంచి ప్యారాషూట్‌ ద్వారా యుద్ధభూమిలో అడుగుపెట్టిన యువత ఆయుధాల్ని, మెడికల్ కిట్స్ ను సేకరిస్తూ అవతలి వారిని చంపుతూ తాము చావకుండా రక్షించుకోవడమే ఈ ఆట. గేమ్‌లో రెడ్ జోన్, నీలి మేఘాలు తరుముకుంటూ వస్తాయి.రెడ్ జోన్‌లో ఉన్నప్పుడు అక్కడి నుంచి బయటకు వచ్చేయాలి. గేమ్‌లో సూచించిన సర్కిల్ లోనే గేమ్ ఆడాలి.గేమ్‌లో సర్కిల్ చిన్నదవుతూ మిగిలిన ప్రత్యర్థులను దగ్గర చేస్తూ ఉంటుంది. దీంతో గేమ్ కష్టతరంగా మారుతుంది. ఈ ఆటను ఒంటరిగా అయినా, ఒక టీం ల అయినా ఆడవచ్చు.ముక్కూమొహం తెలియకున్నా, ఆన్‌లైన్‌లో గేమ్ ఆడుతూ, వారితో ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ శత్రువులను చంపే వెసులుబాటు ఈ యాప్‌లో ఉంటుంది. గేమ్ లో గరిష్టంగా వంద మంది అడగలుగుతారు. యుద్ధంలా సాగే ఈ క్రీడలో గాయపడితే మెడికల్ కిట్‌లు, అవతలి వారిని చంపడానికి ఆయుధాలు ఉంటాయి. గెలిస్తే చికెన్ డిన్నర్లు కూడా ఉంటాయి.

పబ్ జి వ్యసనం:
ఎవరి ఫోన్లో చూసినా ఈ గేమే కనిపించేది. ఈ ఆటకు పిల్లలు, యువత వ్యసనపరులు అయిపోయారు. ఆన్‌లైన్ పబ్‌జీ గేమ్ ఉచ్చులో పడి పబ్‌జీ మొబైల్ అకౌంట్‌ను అప్‌గ్రేడ్ చేసుకునేందుకు రూ.16 లక్షలు ఖర్చు చేశాడు ఒక్క బాలుడు. అదే తరహాలో పబ్‌జీ ఆడడం కోసం రెండు నెలల్లో తన తాత పెన్షన్ ఖాతా ద్వారా అకౌంటు నుంచి 30 లావాదేవీల రూపంలో రూ.2 లక్షలు కాజేశాడు 15 సంవత్సరాల బాలుడు. ఇది ఇలా ఉంటె పబ్ జి పిచ్చి తో ప్రాణాలని సైతం పోగొట్టుకున్నారు కొంత మంది, ముంబైలో ఓ యువకుడు పబ్‌జీ గేమ్ ఆడేందుకు మొబైల్ కొనివ్వాలని పేరెంట్స్‌ని అడిగాడు. కానీ వారు ఒప్పుకోకపోవడంతో మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కాశ్మీర్‌లో పబ్‌జీకి బానిసైన ఓ ఫిటెనెస్ ట్రైనర్, గేమ్‌లో ఓటమితో మానసికంగా కుంగిపోయాడు. కొన్ని రోజుల తర్వాత పిచ్చోడిగా మారి. తనను తాను తీవ్రంగా గాయపరచుకున్నాడు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ గేమ్ కు అడిక్ట్ అయిపోయిన ఒక యువకుడు, పబ్‌జీ ఆడేందుకు ఫోన్ బ్యాటరీ అయిపోవడం, ఛార్జర్ దొరక్క లేదన్న కోపంతో సొంత బావపైనే కత్తితో దాడికి దిగబడ్డాడు. మరొకచోట ఓ యువకుడు పబ్‌జీ గేమ్‌లో మునిగిపోయి దాహమేస్తే నీళ్లు అనుకొని యాసిడ్ తాగేశాడు. 18 ఏండ్ల టీనేజ్ కుర్రాడు, 12 సంవత్సరాల పిల్లవాడు పబ్ జి గేమ్ ఆడటానికి, తల్లితండ్రులు మంచి మొబైల్స్ కొన్ని ఇవ్వలేదు అన్ని మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారు. పబ్ జీ ఆడనివ్వడం లేదని ఒక యువకుడు ఏకంగా తన తండ్రినే హత్య చేశాడు. తనకు ఎదురు చెబుతున్నాడనే అక్కసుతో ఆ యువకుడు.. కత్తి తీసుకుని తలపై ఒక్క వేటు వేయడంతో ఆ తండ్రి మరణించాడు. టైమ్‌పాస్ కోసం ఆడే.. ఆన్‌లైన్ గేమ్స్ వ్యసనంగా మారి, లేనిపోని సమస్యలు కొని తెచ్చుకున్నారు యువత, పిల్లలు. ఆన్‌లైన్ గేమ్‌లకు అడిక్ట్ అవడం, గేమ్ ఆడుతున్న సమయంలో ఎవరినీ పట్టించుకోకపోవడం. మరీ ఈ పబ్జీ గేమ్ అయితే, గేమ్ నుంచి పక్కకు చూస్తే గేమ్‌లో శత్రువులు మన మీద దాడి చేసి చంపేస్తారనే భయంతో పరిసరాలను సైతం మరిచిపోయి ఆటలో మునిగిపోయారు. ఎంతా అడిక్ట్ అంటే ఫోన్ చేసినా ఎత్తరు, పిలిచినా పట్టించుకోరు. బలవంతంగా మాట్లడిస్తే అసహనం ప్రదర్శిస్తారు. కొన్ని సందర్భాల్లో అయితే కోపంలో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ప్రవర్తించారు.ఆట ఆడలేకపోతున్నాం అన్నే కోపం తో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కొంత మంది అయితే, కుటుంబ సభ్యుల ప్రాణాలు తీసిన వాళ్ళు మరికొంతమంది.

పబ్ జి బ్యాన్:
ఇటీవల కాలం లో యూజర్ల డేటా, సెక్యూరిటీ ఆందోళనల కారణంగా భారత ప్రభుత్వం మొత్తం 118 చైనా యాప్స్‌పై నిషేధం విధించింది. వాటిలో పబ్‌జీ మొబైల్, పబ్‌జీ మొబైల్ లైట్ యాప్స్‌ ని కూడా కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఈ ఆన్లైన్ గేమింగ్ యాప్ దక్షిణ కొరియాది అయినప్పటికీ చైనా కి సంబందించిన సంస్థ దీనిలో భాగం అవడమే ఈ గేమ్ బ్యాన్ చేయడానికి కారణం అయింది. అక్టోబర్ 30 న ఇండియాలో పబ్ జి కి సంబందించిన పూర్తి సేవల్ని నిలిపివేసింది,టెన్సెంట్ గేమ్స్ . అయితే అంతకుముందే దేశం లోని కొన్ని రాష్ట్రాలు, ఈ గేమ్‌ వల్ల పిల్లలు, యువత ఎక్కువ ప్రభావితం అవుతున్నారని, వారు చెడు దారిలో వెళ్తున్నారని మానసిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలోనే ఈ గేమ్‌ను నిషేధించాయి.

పబ్ జి బ్యాక్:
అయితే మళ్ళీ పబ్ జి గేమ్ భారత్ దేశం లో అందుబాటులోకి రానున్నది. భారతదెశ యూజర్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త వెర్షన్‌గా ‘పబ్‌జీ మొబైల్‌ ఇండియా’ పేరుతో త్వరలోనే లాంచ్‌ చేయనున్నామని పబ్‌జీ కార్పొరేషన్ మాతృ సంస్థ క్రాఫ్టన్ తెలిపింది.ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సురక్షితమైన ఆరోగ్యకరమైన కొత్త వెర్షన్ గేమ్‌ప్లేను వినియోగదారులకు అందిస్తామని కంపెనీ తెలిపింది. డేటాను సురక్షితంగా ఉంచారని నిర్ధారించుకోవడానికి భారతీయ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని నిల్వ చేసే నిల్వ వ్యవస్థలపై క్రమం తప్పకుండా ఆడిట్లు మరియు ధృవీకరణలు ఉంటాయని ఈ గేమింగ్ కార్పొరేషన్ పేర్కొంది. డెవలపర్లు వారు ఆటలోని కంటెంట్‌ను మెరుగుపరుస్తారని మరియు “స్థానిక అవసరాలను ప్రతిబింబించేలా” అనుకూలీకరించారని కూడా పంచుకున్నారు. ఇది యువ ఆటగాళ్లకు ఆట సమయాన్ని పరిమితం చేయడానికి ఒక లక్షణాన్ని కూడా జోడిస్తుంది. గేమ్‌ డెవలప్‌మెంట్‌, వ్యాపార విస్తరణకు సంబంధించి దేశీయంగా 100 మందికి పైగా ఉద్యోగులను కూడా నియమించుకోనుంది. అయితే గేమ్ రిలీజ్ డేట్ ఎపుడు అనేది కంపెనీ చెప్పలేదు.

ఎంతో మంది పిల్లలు, యువత జీవితాలని నాశనం చేసిన పబ్ జి ఆట, మళ్ళీ ఇండియా లో ప్రవేశ పెడ్తున్న సమయం లో, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాల్ని తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju