Premi Vishwanath: ప్రముఖ టీవీ ఛానల్ స్టార్ మా లో 2017 వ సంవత్సరం నుంచి నిర్విఘ్నంగా ప్రసారమవుతూ రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్ని లక్షల మంది అభిమానులను సంపాదించుకున్న సీరియల్ కార్తీక దీపం. ఇందులో ముఖ్యంగా దీప పాత్రలో నటించిన ప్రేమి విశ్వనాధ్ కి ఉన్న ఫ్యాన్స్ గురించి అయితే ప్రతేకంగా చెప్పుకోవాలిసిన పనిలేదు. టీఆర్పీ రేటింగ్స్ లో నెంబర్ వన్ గా దూసుకుపోతుంది కార్తీక దీపం సీరియల్. ప్రేమి విశ్వనాధ్ కేరళ కుట్టి. ఆమె పుట్టి పెరిగింది అంతా కేరళ లోనే. కార్తీక దీపం సీరియల్ లో నటించక ముందు మలయాళం లో ఒక సీరియల్ నటించారు ప్రేమి విశ్వనాధ్. అంతేకాకుండా మలయాళం లో పలు గేమ్ షోస్ కి కూడా హోస్ట్ గా వ్యవహరించారు.
ప్రస్తుతం తెలుగులో ఓ వైపు సీరియల్ లో నటిస్తూనే మరో వైపు యాడ్స్ లో కూడా నటిస్తున్నారు. ప్రేమి విశ్వనాధ్ భర్త, కేరళ లోనే పేరు ప్రఖ్యాతులు ఉన్న ఆస్ట్రాలజర్. ఇంకా ప్రేమి విశ్వనాధ్ కి ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఈమె ఒక వారం షూటింగ్ హైదరాబాద్ లో అలాగే మరో వారం కేరళ లోనూ గడుపుతూ ఉంటారు.
కార్తీక దీపం సీరియల్ లో దీప పాత్రలో ఆమెకి అంతగా చదువు లేదు కానీ నిజ జీవితంలో ఆమె పెద్ద చదువులే చదివారు. ప్రేమి విశ్వనాధ్ కేరళలో లా (Law) పూర్తిచేశారు. ఈమె అనుకోకుండా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టారు. ఆమె సోదరుడు ఓ ఫోటోగ్రాఫర్. వారికి ఊరిలో ఓ సొంత స్టూడియో కూడా ఉంది. తన సోదరుడు తీసిన ఫొటోలనే ఆడిషన్ కు పంపగా ఆమెను మలయాళం సీరియల్ డైరెక్టర్ ఎంపిక చేశారు.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!