సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ నటప్రస్థానం 45 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో కోలీవుడ్ ఇండస్ట్రీతో పాటు పలువురు సోషల్ మీడియాలో ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇటువంటి తరుణంలో ఆస్కార్ అవార్డు గ్రహీత ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ రజినీకి పోస్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. రజినీకాంత్ ’45 ఏళ్ల రజనీయిజం’ అనే ట్యాగ్ లైన్ తో పోస్టర్ డిజైన్ చేశారు. దానిని ఏ.ఆర్.రెహమాన్ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ రజినీకాంత్ కి ప్రత్యేకమైన అభినందనలు తెలిపారు.
ఈ పోస్టర్ లో ఆయనకు పేరు తెచ్చిన సినిమాలోని ఫోటోలను చేర్చారు. రోబో అదేవిధంగా శివాజీ సినిమా లలో ఉన్న ఫోటోలు ప్రత్యేకంగా ఆకర్షణీయంగా నిలిచాయి. పర్వత శిఖరమంత ఎత్తు ఎదిగిన రజినీకాంత్‌ను చూసేందుకు పెద్దఎత్తున జనం మెట్లు ఎక్కుతూ పైకి వెళ్తున్నట్టు కూడా ఇందులో డిజైన్ చేశారు. ఏ ఆర్ రెహమాన్ విడుదల చేసిన ఈ స్పెషల్ పోస్టర్, ఇప్పుడు సోషల్ మీడియాలో రజినీ అభిమానులను అలరిస్తు వైరల్ గా మారింది.