‘RRR’: 3 నిమిషాల ట్రైలర్ ఓకే..3 గంటల రన్ టైమ్ ప్లస్సా మైనస్సా..? ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో ఇదే హాట్ టాపిక్ అవుతోంది. ఈ మధ్య కాలంలో 3 గంటల రన్ టైమ్ ఉన్న సినిమాలేవి రావడం లేదు. వచ్చినా జనాలకు అంతసేపు చూసే ఓపికా ఉండటం లేదు. అందుకే ఎంత పెద్ద స్టార్ హీరో సినిమాకైనా రెండున్నర గంటలోపే శుభం కార్డ్ వేస్తున్నారు. అయితే ఇప్పుడు రాబోతున్న పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్ సినిమా రన్ టైమ్ మాత్రం 3 గంటలకు పైగా ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇది సినిమాకు ప్లస్సా మైనస్సా అనేదే ఇప్పుడు అందరిలో సాగుతున్న తీవ్ర చర్చ. మెగా పవర్ స్టార్ రాం చరణ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోలుగా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ చరణ్ సరసన, బ్రిటన్ మోడల్ ఓలివియా మోరీస్ ఎన్.టి.ఆర్ సరసన నటించారు. అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్ర ఖని కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. రాజమౌళి సినిమా అంటే ప్రమోషన్స్ ఏ రేంజ్లో ఉంటాయో అందరికీ తెలిసిందే. ఆ ప్రమోషన్స్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో నెవర్ బిఫోర్ అనేలా రాజమౌళి బృందం నిర్వహించబోతోంది.
‘RRR’: ఇద్దరు పోరాట యోధుల జీవిత కథ ఆధారంగా రూపొందించిన ఫిక్షనల్ డ్రామా.
ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన రెండు విషయాలు వైరల్ న్యూస్ అవుతున్నాయి. ఒకటి థియేట్రికల్ 3 నిమిషాలు ఉంటుందట. ఈ ట్రైలర్‌తో ఆర్ఆర్ఆర్ సినిమా రేంజ్ ఏంటో శాంపిల్ చూపించనున్నారని తెలుస్తోంది. ఇక మొత్తం సినిమా రన్ టైమ్ ఫైనల్‌గా 3 గంటలకు పైగానే వచ్చిందని సమాచారం. ఇంతకంటే ట్రిమ్ చేసే వీలు కూడా లేదట. మరి అంతసేపు సినిమా చూసే ఓపిక ఉంటుందా అంటే అది రాజమౌళి సినిమా. ఓ విజువల్ వండర్‌గా ఉంటుంది. చరణ్, తారక్ లాంటి స్టార్స్ ..ఆలియా భట్ లాంటి ప్రముఖ నటీ నటులు ఇద్దరు పోరాట యోధుల జీవిత కథ ఆధారంగా రూపొందించిన ఫిక్షనల్ డ్రామా. కాబట్టి 3 గంటలకు పైగా ఉన్నా థియేటర్స్‌లో ప్రేక్షకులు థ్రిల్ ఫీలవుతారని చెప్పుకుంటున్నారు.