Samantha: టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రస్తావన అవసరంలేదు. విడాకుల అనంతరం కూడా జెట్ స్పీడుతో సినిమాలు చేసుకుంటూ పోతుంది. ఇక సామ్ ఫిట్నెస్ గురించి తెలిసినదే. వయస్సు 35 వస్తున్నా ఇంకా 25 సంవత్సరాల పడుచులాగే ఉంటుంది. సన్నగా, నాజూకుగా కనిపించే ఈ ముద్దుగుమ్మ కష్టతరమైన వర్కవుట్స్ చేయడంలో కూడా అందరికంటే ముందుంటుంది. స్క్వాట్స్, ఏరోబిక్స్, ఏరియల్ యోగా.. ఎలాంటి వర్కవుట్ అయినా అవలీలగా చేసి పడేయడం సామ్‌కు వెన్నతో పెట్టిన విద్య.
Samantha: చైతన్యతో విడిపోయిన తరువాత ఇలా అవుతుంది అనుకోలేదు .. ముందే తెలిసిఉంటే : సమంత
Samantha: జిమ్ ట్రైనర్ ఇలా అనేశాడు!
ఇకపోతే సామ్ వ్యక్తిగత జిమ్ ట్రైనర్ అయినటువంటి జునైద్ షేఖ్ ఆమె గురించి ఓ ఇంటరెస్టింగ్ విషయం బయటపెట్టాడు. అదేమంటే, సమంత ఒకవేళ అథ్లెట్ అయితే విరాట్ కోహ్లీలా ఉండేదని చెప్పుకొచ్చాడు. సామ్ చాలా దూకుడుగా ఉంటుంది. కష్టమైన పనులు కూడా తేలికగా చేయాలనుకుంటుంది. ఆమెను చూసి ఒక్కోసారి నేను కూడా స్పూర్తిని పొందుతాను. క్రమం తప్పకుండ ప్రతీ రోజు ఉదయాన్నే నిద్రలేచి వర్కవుట్స్ పూర్తి చేస్తుందన్నాడు.
Samantha: సమంతకి అత్యంత ఇష్టమైన నేస్తాలెవరో తెలిసిపోయింది!
దానికోసం సామ్ అంతలా కష్టపడిందట!
ఇకపోతే పుష్ప సినిమా ఐటెం సాంగ్ ‘ఊ అంటావా మావ ఊఊ అంటావా’ పాట ప్రిపరేషన్ కోసం సామ్ చాలా వర్కవుట్ చేసిందని చెప్పుకొచ్చాడు మన జునైద్. సామ్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అయినటువంటి విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాతువాకుల రెండు కాధల్’ సినిమాలో ఓ కీలక రోల్ లో నటిస్తోంది. గుణశేఖర్ డైరెక్షన్లో సామ్ చేస్తున్న ‘శాకుంతలం’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. దీంతోపాటు మరో ఫీ మేల్ ఓరియెంటెడ్ సబ్జెక్టు యశోధ సినిమాలో సామ్ టైటిల్ రోల్ పోషిస్తోంది.