Samantha: సామ్-చే విడాకుల తంతు ముగిసి నెలలు గడుస్తున్నా, ఇప్పటికీ వారికి సంబంధించిన వార్త ఏదోఒకటి సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతూనే ఉంటుంది. 2010లో వచ్చిన ‘ఏం మాయ చేశావే’ చిత్రంలో సమంత, నాగచైతన్య కలిసి నటించారు. ఆ సినిమాలో ప్రేమికులుగా నటించిన వీరు తర్వాత కాలంలో నిజమైన ప్రేమికులుగా మారి కొంతకాలం డేటింగ్ అనంతరం ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇరువైపులా పెద్ద కుటుంబాలు కావడంతో పెళ్లి అటు హిందూ సంప్రదాయంలోనూ, ఇటు క్రిస్టియన్ సంప్రదాయంలోనూ రెండురకాలుగా వైభవంగా జరిగింది.
Samantha: సమంతకి అత్యంత ఇష్టమైన నేస్తాలెవరో తెలిసిపోయింది!
Samantha: తరువాత ఇలా షాక్ ఇచ్చారు!
ఇక తరువాత వీరు ఎంతో అన్యోన్య దంపతులుగా బయట చలామణి అయ్యారు. టీవీ షోస్ కైతే హద్దే లేకుండా పోయింది. ఇద్దరు కలిసి జంటగా వెళ్లేవారు.. ఇక ఉన్నపలంగా ఏం జరిగిందో కానీ… అందరికీ షాకిస్తూ సడెన్ గా విడిపోయారు. టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న సమంత, నాగచైతన్యలు తమ వివాహ బంధానికి గుడ్ బై చెబుతూ ఇరు అభిమానులకు షాక్ ఇచ్చారు. వారిద్దరూ విడిపోతున్న వార్తతో వారి కుటుంబాలతో పాటు సినీ ప్రముఖులు కూడా షాక్ కు గురయ్యారు.
Samantha: వామ్మో సమంత! న్యూ ఇయర్ రోజే నాగార్జున + నాగ చైతన్యకి పంచ్ వేసిందిగా!
సమంత తాజా స్పందన ఇదే:
విడాకుల అనంతరం చాలా గ్యాప్ తరువాత సమంత ఈ విషయం ఓ మీడియా వేదికగా స్పందిస్తూ.. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత చాలా భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నానని వాపోయింది. 2021లో తన వ్యక్తిగత జీవితం భగ్నం అయిందంటూ చెప్పుకొచ్చింది. తర్వాత తన జీవితంలో ఎలాంటి అంచనాలు లేకుండా పోయాయని, తాను ఎంతో జాగ్రత్తగా రూపొందించుకున్న ప్రణాళికలన్నీ శిథిలమైపోయాయని ఈ నేపథ్యంలో అభిప్రాయపడింది.