25.2 C
Hyderabad
January 31, 2023
NewsOrbit
న్యూస్ హెల్త్

Samosa: టేస్టీగా ఉన్నాయని సమోసాలు అదేపనిగా లాగిస్తున్నారా.. ఇదోసారి చదవండి..

Share

Samosa: భారత చిరు తిండ్లలో సమోసాకి ఒక ప్రత్యేకత ఉంది. మన దేశంలో ఎక్కడికి వెళ్లినా ఈ స్నాక్స్ దొరుకుతాయి. ఎందుకంటే వాటికి ఉన్న పాపులారిటీ అది. నిజానికి సమోసాని ఇష్టపడిన వారు ఎవరు ఉండరు. ఇక ఆహార ప్రియులైతే సమోసాని చూడగానే వెంటనే తినేయాలని అనుకుంటారు. సాయంత్రం కాగానే అలా బయటికి వెళ్లి టీ తాగుతూ సమోసా తింటుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. కొంతమంది ఈవినింగ్ స్నాక్‌గా డైలీ సమోసాలు తినేస్తూ ఉంటారు. ఒకటి రెండు తింటే పర్వాలేదు కానీ మరి అధిక మొత్తంలో సమోసాలను తింటే ఆరోగ్యానికి హాని చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Samosa: డేంజర్

Samosa

సమోసాలు వేయించే నూనెలో అధిక మొత్తంలో కొవ్వు ఉంటుంది. ఆ నూనె వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. మార్కెట్లలో లభించే సమోసాలు వేయించడానికి నూనెను మార్చకుండా మళ్లీ మళ్లీ దానినే ఉపయోగిస్తూ ఉంటారు. అలా ఒకసారి వాడిన నూనెను మళ్ళీ మళ్ళీ వాడటం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి అధిక మొత్తంలో పెరిగి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాకుండా సమోసాలు అధికంగా తినడం వల్ల బాడీలో క్యాలరీలు పెరిగి ఊబకాయ సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సమోసాలలో వాడే పదార్థాలు మైదా, ఆలు, నూనె చర్మానికి హాని కలిగించేవి కాదు. కానీ తినాల్సిన దాని కంటే ఎక్కువగా తింటే చర్మంపై మూడతలు, మొటిమలు వస్తాయి.

సమోసా రెసిపీస్‌

Samosa

సమోసాలను రకరకాల రూపాల్లో తయారుచేసి, రకరకాల పేర్లు పెట్టి అమ్ముతుంటారు. చీస్ చిల్లి సమోసా బాగా పాపులర్ అయిన ఒక రెసిపీ. ఈ సమోసాని చీస్ కలిపి తయారు చేస్తారు. పంజాబీ ఆలు సమోసా అనేది మరో రెసిపీ. దీనిని పంజాబీ మసాలా దినుసులతో ఆలు కుర్మాతో ఎంతో రుచికరంగా తయారు చేస్తారు. కార్న్ మసాలా సమోసా కూడా ఫేమస్ అయ్యింది. మొక్కజొన్నలను సమోసా మిశ్రమంలో కలిపి ఈ సమోసాలను తయారు చేస్తారు. కార్న్ మసాలా సమోసాలకు వర్షా కాలంలో గిరాకీ ఎక్కువగా ఉంటుంది.

లిమిట్ దాటితే రిస్కే

బర్గర్లు, ఇతర జంక్ ఫుడ్స్‌తో పోలిస్తే సమోసాలు హెల్దీవే అని చెప్పొచ్చు. కాకపోతే వీటిని పరిమితి దాటి తింటే అనారోగ్యం బారిన పడక తప్పదని చెప్తున్నారు నిపుణులు. ముఖ్యంగా సమోసాలు వేయించే నూనె విషపూరితమైనది. అంతేకాకుండా సమోసాలు తయారు చేయడానికి వాడే పిండి కూడా అనేక సమస్యలకు దారి తీస్తుంది. సమోసాలలో ఎక్స్‌ట్రా కెలరీలు ఎక్కువగా ఉంటాయి. ఒక సమోసాలో దాదాపు 262 క్యాలరీలు ఉంటాయి. వీటి వాళ్ల ఆరోగ్యనికి ప్రమాదం. కాబట్టి సమోసాలకు మితంగా తినడం మంచిది.


Share

Related posts

Telangana : అడ్వకేటు దంపతుల హత్యకు సవాలక్ష కారణాలు!పోలీసులు పొలిటీషియన్ల ఇన్వాల్వ్మెంట్ పై అనుమానాలు!!

Yandamuri

కరోనా అలెర్ట్ వాచ్ తయారు చేసిన యువతి

Siva Prasad

Congress: యూపీ ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ కు దిమ్మ‌తిరిగిపోయే షాక్

sridhar