NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బాత్రూంలో కెమెరాలు పెట్టేశాడు…. ప్ర‌ధానమంత్రి పాడు ప‌ని

ఒక్కోసారి కొన్ని సంఘ‌ట‌న‌లు షాక్ క‌లిగిస్తుంటాయి. ఇలా కూడా జ‌రుగుతుంటాయా అని విస్మ‌యం క‌లిగిస్తుంటాయి. అలాంటిదే ఈ ఘ‌ట‌న. ఓ ఆడ‌కూతురు విష‌యంలో ఊహించ‌ని ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది.

 

పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం షరీఫ్ త‌న‌కు జ‌రిగిన అవ‌మానంపై ఆవేద‌న చెందారు. ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.

నా బాత్రూంలో కెమెరాలు పెట్టించాడు

పాక్ మాజీ ప్ర‌ధాని ష‌రీఫ్ కుమార్తె అయిన మరియంతోపాటు ఆమె భర్త కెప్టెన్‌ సఫ్దర్‌ను అక్టోబర్‌ 19 న సైన్యం, ఐఎస్‌ఐ అధికారులు బలవంతంగా అరెస్ట్‌ చేసి జైలుకు పంపించారు. శుక్రవారం విడుదలైన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా సంచ‌ల‌న కామెంట్లు చేశారు. జైలులో ఉన్న సమయంలో తన బ్యారక్ బాత్రూంలో కెమెరాలను ఏర్పాటు చేశారని ఆరోపించారు. జైలులో తనను అక్కడి అధికారులు తీవ్రంగా వేధించారని, తానుంటున్న బ్యారక్‌ బాత్రూంలో కెమెరాలు పెట్టారని ఆరోపించారు. ఇది స్త్రీలను అవమానించడమే అన్నారు. మాజీ ప్రధాని కుమార్తె అయిన త‌న‌కే ర‌క్ష‌ణ లేకపోతే ఇక పాకిస్తాన్‌లోని సాధారణ మహిళల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. త‌ద్వారా పాకిస్థాన్‌లోని ప‌రిస్థితుల‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపారు.

పాకిస్థాన్‌లో ఎంపీ బ‌తుకే ఇలా… సామాన్యుల ప‌రిస్థితి….

పాకిస్తాన్‌లో మాజీ ప్రధాని కుమార్తె, ఎంపీ సురక్షితంగా లేకుంటే.. సాధారణ మహిళ ఎలా సురక్షితంగా ఉంటారు అని మరియం షరీఫ్‌ ప్రశ్నించారు. పాకిస్తాన్ రాజకీయాలు, ప్రభుత్వానికి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలపై మరియం మాట్లాడారు. ‘ఇటీవల ప్రభుత్వం నన్ను రెండుసార్లు జైలుకు పంపింది. నేను అక్కడి పరిస్థితి గురించి మాట్లాడితే వింతగా అనిపిస్తుంది. స్త్రీల పట్ల ఇలాగానే ప్రవర్తించడం? నేను నిజం చెబితే.. ప్రభుత్వం, పరిపాలనాధికారులు వారి ముఖం కూడా చూపించలేరు. ఇమ్రాన్ ఖాన్‌ నేతృత్వంలోని ప్రభుత్వంలో పాకిస్తాన్ మహిళలకు రక్షణ లేదని తెలుస్తున్నది. ఇక్కడి మహిళలు బలహీనంగా లేరని ఇమ్రాన్‌ఖాన్‌ గుర్తుంచుకోవాలి’ అని చెప్పారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్- నవాజ్ (పీఎంఎల్-ఎన్) ఉపాధ్యక్షురాలు, ఎంపీ కూడా అయిన తన పట్ల ఇంత దురుసుగా ప్రవర్తించడం సహించరానిదని అన్నారు.

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju