Shruti Haasan: కమల్ హాసన్ కూతురు అనే గుర్తింపే కాదు ఒక మంచి నటిగా కూడా పేరు తెచ్చుకుంది శ్రుతి హాసన్. ఈ స్టార్ హీరోయిన్ హిందీ, తెలుగు, తమిళం సినిమాలోనే కాకుండా వెబ్‌సిరీస్‌లలో నటించి మెప్పిస్తోంది. మల్టీ టాలెంటెడ్ అమ్మాయిగానూ శృతిహాసన్ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ ముద్దుగుమ్మ వ్యక్తిగత జీవితం మాత్రం చాలా ఒడిదుడుకులతో సాగింది. ముఖ్యంగా ఆమె ప్రేమలో చాలాసార్లు ఫెయిల్ అయినట్టు వార్తలు వచ్చాయి. ధనుష్, నాగచైతన్య, రణబీర్ కపూర్‌తో ఈ ముద్దుగుమ్మ ప్రేమ అయిన నడిపినట్టు సినిమా వర్గాల్లో రూమర్స్ వచ్చాయి.
ఇక శ్రుతి హాసన్ పబ్లిక్‌గానే లండన్‌కు చెందిన నటుడు మైఖేల్ కోర్సలేతో రిలేషన్‌షిప్ పెట్టుకుంది. కానీ అతనికి కొన్నేళ్ల క్రితం బ్రేకప్ చెప్పింది. ప్రస్తుతం శ్రుతి ఇంకొకరితో రిలేషన్ షిప్ లో ఉంది. అతడే డూడల్ ఆర్టిస్ట్ శాంతను హాజారికా. ఈ ఆర్టిస్ట్ తో శ్రుతి రొమాంటిక్ ఫోటోలు, వీడియోలు ఇప్పటికే విడుదలై వారి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉందో చెప్పకనే చెప్పాయి. అయితే ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని శాంతనుతో తన సంబంధం గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. అతనితో డేటింగ్‌లో ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నానని.. ఈ రిలేషనషిప్‌ను హైడ్ చేయాలని ఇకపై అనుకోవడం లేదని కుండ బద్దలు కొట్టింది.
తాజాగా ఒక నేషనల్ మీడియాలో ఇంటర్వ్యూ శ్రుతిని పెళ్లి గురించి అడిగారు. ఈ ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం విని అందరూ అవాక్కవుతున్నారు. “పెళ్లికి సంబంధించిన ఎలాంటి సమాధానం ప్రస్తుతం నా దగ్గర లేదు” అంటూ ఆమె సింపుల్ గా ఆన్సర్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వయసు 36 ఏళ్లు. ఇప్పటికే ఒకసారి లవ్‌లో ఫెయిల్ అయింది. ఇప్పుడు మరొక వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఇంకా ఎన్నిరోజులు ఇలా పెళ్లి చేసుకోకుండా ఈ హీరోయిన్ ఉంటుంది ? అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆమె తాజా సమాధానంతో శాంతనుతో లివ్-ఇన్ రిలేషన్ షిప్ లో ఉండి ఎంజాయ్ చేస్తుందా లేక ఇతన్ని అయిన పెళ్లి చేసుకుంటుందా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది.
విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వరలోనే `కార్తికేయ 2`తో పలకరించబోతున్నాడు.…
బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…
గత కొద్ది నెలల నుండి సినిమాల ద్వారా వచ్చే ఆదాయం బాగా తగ్గిపోవడం, నిర్మాణ వ్యయం మోయలేని భారంగా మారడంతో.. తెలుగు సినీ నిర్మాతలు తమ సమస్యలను…
జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…
యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్షకులను…
సౌత్‌లో లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందిన నయనతార ఇటీవలె కోలీవుడ్ దర్శక,నిర్మాత విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…