Sukumar: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్టింగ్ లో వరుస బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కించిన డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్. అయితే ఆ తర్వాత వరుస ఫ్లాపులు రావటంతో దాదాపు రెండు సంవత్సరాల పాటు బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ నుండి ఏటువంటి సినిమా రిలీజ్ కాలేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అక్కినేని అఖిల్ తో.. “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ దాదాపు పూర్తి అవడం జరిగింది. త్వరలో విడుదల అవటానికి సిద్ధంగా ఉంది. ఇటువంటి తరుణంలో తాజాగా ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ కి బొమ్మరిల్లు భాస్కర్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో డైరెక్టర్ సుకుమార్ ప్రస్తావన వచ్చిన క్రమంలో బొమ్మరిల్లు భాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డైరెక్టర్ సుకుమార్ ది.. తనది ఒకే తరహా ఆలోచనలు కొంచెం సూట్ అవుతాయని చెప్పుకొచ్చాడు.
Read more: Sukumar: సినిమాలపై ప్రేమతో ప్రారంభంలో సుకుమార్ చేసిన త్యాగాలు..!!
కానీ సుకుమార్ స్టైల్ విషయానికొస్తే చాలా మొండి వాడు… నటుడు నుండి ఏది రా పట్టుకోవాలో.. దానిని ఎలాగైనా రాబట్టు కుంటాడు. ఆ విషయంలో అసలు తగడు. కానీ సుకుమార్ పైకి.. ఆవిధంగా కనిపించడు. చాలా ఫోకస్.. డిఫరెంట్ ఆలోచనలతో.. చాలా పెషన్ తో.. ఈ సన్నివేశాలు చిత్రీకరిస్తారు అని తాజా ఇంటర్వ్యూలో బొమ్మరిల్లు భాస్కర్ తెలిపాడు. ఇక తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ రోజుకి కేవలం రెండు గంటలు మాత్రమే.. నిద్రపోవడం జరుగుతుందని చెప్పుకొచ్చాడు. ఇదే లైఫ్ స్టైల్ సుకుమార్ ది అని కూడా తెలిపాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా గురించి మాట్లాడుతూ… ఈ సినిమా విజయం తనకి ఎంత కీలకమో అదే రీతిలో అఖిల్ కి కూడా అంటూ చెప్పుకొచ్చాడు. అన్ని వర్గాల ఆడియన్స్ నీ ఈ సినిమా ఎంటర్టైన్ చేస్తుందని బొమ్మరిల్లు భాస్కర్ తెలిపాడు.