NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana: ఏపీ సీఎంపై మాటల తూటాలు పేల్చిన తెలంగాణ మంత్రి !కెసిఆర్ కి తెలియకుండానే ఇది జరిగి ఉంటుందా?

Telangana: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలంగాణ మంత్రి ఒకరు తీవ్రస్థాయిలో ఫైర్ కావటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.ఆ మంత్రి కూడా తెలంగాణ సిఎం కేసీఆర్‌ కి సన్నిహితుడు కావడంతో ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సంబంధాలు బెడిశాయా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.ఒక ముఖ్యమంత్రిపై పొరుగు రాష్ట్ర మంత్రి ఒకరు ధ్వజమెత్తడంతో పాటు వార్నింగ్ ఇచ్చేటట్లు మాట్లాడటమనేది ఆషామాషీ విషయం కాదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.దీని వెనుక పెద్ద సారు హస్తం తప్పక ఉంటుందన్నది తెలంగాణ రాజకీయ పరిశీలకుల భావన.విషయానికొస్తే ..

Telangana Minister who fired bullets of words at AP CM! Could this have happened without KCR's knowledge?
Telangana Minister who fired bullets of words at AP CM! Could this have happened without KCR’s knowledge?

జగన్ పై చెలరేగిన మంత్రి శ్రీనివాస్ గౌడ్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటి దోపిడీకి పాల్పడుతోందని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశంలో ఆరోపించారు.ఈ సందర్బంగా ఆయన సీఎం జగన్ పై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణతో ఏపీ సీఎం జగన్‌ది నిజమైన స్నేహం కాదన్నారు. జగన్ వైఖరి నోట్లో చక్కెర, కడుపులో కత్తెర అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.ఇదే సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పైనా ఆయన విసుర్లు విసిరారు.వైఎస్ కాలంలో రాజోలు బండ దగ్గర తూములు పగలకొట్టి నీళ్లు దోచుకుపోయారని గుర్తు చేశారు. అదే పంథాను ఆయన కుమారుడు జగన్మోహన్రెడ్డి కూడా అవలంబిస్తున్నారని అన్నారు.ఇప్పుడు తెలంగాణ నుండి జగన్ 80 వేల క్యూసెక్కులు తీసుకుపోతున్నారని ఆరోపించారు.గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులను జగన్ ఉల్లంఘిస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్రం అనుమతిలేకుండానే రాయలసీమ ప్రాజెక్టు పనులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాగైతే పాలమూరు ప్రజలు బ్రతుకొద్దా..వారికి నీళ్లోద్దా అని శ్రీనివాస్ గౌడ్ ఏపీ ప్రభుత్వాన్ని నిలదీశారు.

దౌర్జన్యాలు తిప్పికొడతాం!

తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అంతటితో ఆగలేదు. ఏపీ ప్రభుత్వానికి వార్నింగ్ కూడా ఇచ్చారు. తెలంగాణ ఎగువన ఉందని, ఏపీలో ఒకటి కడితే ఇక్కడా పది కడతామని ఆయన హెచ్చరించారు. పైనుంచి నీళ్లను మలుపు కోవడం తమకు తెలియదా అని ప్రశ్నించారు. దౌర్జన్యం చేస్తామంటే తాము ఊరుకోమని మంత్రి హెచ్చరించారు.ఈ స్థాయిలో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడటం వెనుక తప్పనిసరిగా ఉన్నతస్థాయి ప్రోద్బలం ఉండే ఉంటుందన్నది సర్వత్రా వినిపిస్తున్న టాక్.మరి ఏపీ ప్రభుత్వం రియాక్షన్ ఎలా వుంటుందో చూడాలి.

 

Related posts

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N