హనిమూన్ కి వెళ్లిన జంట జైలుపాలయ్యింది.. కారణం ఏమిటో తెలిస్తే షాక్?

కొత్తగా పెళ్లైన జంట ఏకాంతంగా గడపాలని ఆశపడుతుంటారు. ఎటైనా పర్యటనకు వెళ్లి ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. ఒక మంచి ప్లేస్ సెలక్ట్ చేసుకుని హనిమూన్ కి వెళ్లాలనుకుంటారు. తమ భాగస్వామిని ఆనందింపచేయడం కోసం అలా సరదాగా వెళ్లాలని ఆశపడుతుంటారు. అలాగే ఓ కొత్త జంట కూడా హ్యాపీగా అలా తిరిగి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. అనుకున్న ప్రకారమే హనిమూన్ కి కూడా వెళ్లారు. కాని వారి పరిస్థితులన్నీ చిన్నాభిన్నం అయ్యాయి. అనుకోని సంఘటన వలన జైలు పాలయ్యారు.

పదినెల్లపాటు జైలు శిక్ష అనుభవించాక తెలిసింది… వారి తప్పు ఏమీ లేదని.. హాయిగా గడుపుదామని హనిమూన్ కి వెళ్లాలని ఆశపడిన ఆ జంట పరిస్థితి ఇలా అవుతుందని కలలో కూడా అనుకోలేదేమో..వివరాల్లోకెళితే.. కొత్తగా పెళ్లైన ఏ జంటైనా కొన్ని రోజులు హనిమూన్ కి వెళ్లి ఎంజాయ్ చేసి తిరిగొస్తారు. కాని ఆ జంట మాత్రం రాలేదు. ముంబైకి చెందిన ఒనీబా, షరీఖ్ లు గతేడాది పెళ్లి చేసుకున్నారు.

ఈ కొత్త జంటకు వారి బంధువులు తబస్సం రియాజ్ ఖురేషీ వారికి పెళ్లి గిఫ్ట్ గా హనిమూన్ ఏర్పాటు చేసాడు. దానికోసం ఖతార్ పర్యటనకు అన్ని ఏర్పాటు చేశారు. వీరు 2019 జులై 6 న హనిమూన్ కి బయలుదేరారు. ఈ కొత్తజంట ఖతార్ విమానాశ్రయంలో అడుగుపెట్టగానే అక్కడి కస్టమ్స్ అధికారులు వారి సామాన్లను చెక్ చేశారు. అందులో వారికి నాలుగు కిలోల మాదకద్రవ్యాలు లభించాయి. వారి సమాన్లలో తబస్సం రియాజ్ ఖురేషీ వాటిని పెట్టినట్టు వారికి తెలియదు.

దాంతో కస్టమ్స్ అధికారులు వారిని విచారించారు. దాంతో మాకు తెలియదని, అవి ఎలా ఇందులోకి వచ్చాయో తెలియదని చెప్పుకొచ్చారు. అయినా కస్టమ్స్ అధికారులు వినకుండా వారిని తీసుకెళ్లి జైలులో వేశారు. ఈ జంటకు పదేళ్ల జైలు శిక్షను విధించి, దానితో పాటుగా కోటి రూపాయల జరిమానా కూడా విధించారు. దీనితో ఒనిబా జైలులోనే ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ మారకద్రవ్యాల విషయంలో వారి ప్రమేయం లేదని తెలిసిన నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఏన్సీబీ) అధికారులు వీరిని భారత్ కు తీసుకురావడానికి ఖతార్ అధికారులతో ప్రయత్నాలు చేస్తున్నారు. కావాలని ఆ వ్యక్తి పెట్టిన మారకద్రవ్యాల కారణంగా ఆ నవదంపతుల జీవితం చిన్నభిన్నం అయింది.