టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

గూగుల్ కి పోటీ ఇస్తున్న కొత్త సెర్చ్ ఇంజిన్.. దాని యూజర్స్ ఎంతో తెలిస్తే షాకె

Share

సోషల్ మీడియాలో ఎప్పుడూ ఒకే కంపెనీ ఆధిపత్యం కొనసాగే పరిస్థితి లేదు.. రోజువారీ జీవితం లో భాగమైపోయిన వాట్సాప్ యాప్ లనే ప్రైవసీ పాలసీ అప్డేట్స్ కారణంగా పక్కన పెడుతున్న యూజర్లు.. ప్రత్యామ్నాయం కోసం సిగ్నల్ , టెలిగ్రామ్ వైపు మొగ్గు చూపుతున్న తరుణం ఇది.. ప్రైవసీ కి పెద్దపీట వేసే ఇంటర్నెట్ సాధనాలు, సోషల్ మీడియా యాప్స్ వైపు దృష్టి సాధించారు.. డేటా ప్రొఫైల్ ను వినియోగించి వ్యాపారం చేసే సెర్చ్ ఇంజన్లను కాదని ప్రైవసీ అందించే సెర్చ్ ఇంజన్ల వైపు మొగ్గుచూపుతున్నారు.. ఇన్నేళ్లు గడిచినా ఆధిపత్య ధోరణికి ఇకపై పులిస్టాప్ పడేలా ఉంది.. తాజాగా DuckDuckGo సెర్చ్ ఇంజన్ కు యూజర్లు పెరుగుతుండడం ఓ కొత్త ట్రెండ్ ను సూచిస్తుంది.. ఇది గూగుల్ కి పోటీ ఇవ్వనుందా..

 

The new search engine that competes with Google .. Shock if its users know a lot

గూగుల్ కు ప్రత్యర్థి కానుందా..
ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం గూగుల్ సెర్చ్ ఇంజన్లో రోజుకు 350 కోట్ల సెర్చ్ క్వేరీస్ నమోదు అవుతున్నాయని అంచనా. రోజు 350 కోట్ల ప్రశ్నలు గూగుల్ సెర్చ్ ఇంజన్ ను పలకరిస్తున్నాయి. సెర్చ్ ఇంజన్ వినియోగం లో 90 శాతం వాటా గూగుల్ దే. మిగిలిన సర్చ్ ఇంజన్లు Bing 2.78 శాతం వాటా, yahoo 1. 60 శాతం, Bydu 0.92 శాతం, Yandex 0.85 శాతం, DuckDuckGo 0.50 శాతం వాటాతో బరిలో ఉన్నాయి.

The new search engine that competes with Google .. Shock if its users know a lot

 

ఇదే సమయంలో DuckDuckGo సెర్చ్ ఇంజన్ లో సెర్చింగ్ క్వేరీస్ సంఖ్య రోజురోజుకీ గణనీయంగా పెరుగుతుంది.. తాజాగా 10 కోట్ల సెర్చ్ క్వేరీస్ మైలురాయిని అందుకుంది.. ఇందుకు కారణం ఏమిటంటే ప్రైవసీ కి పెద్దపీట వేయటం . ఐపి అడ్రస్ వంటివి ఇది సేకరించదు. ఇతర సెర్చ్ ఇంజన్ లతో పోలిస్తే duckduckgo భిన్నం. సెర్చ్ క్వేరీ ల ఆధారంగా యూజర్ ను ట్రాక్ చేసి భారీ అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ కలిగి ఉన్న సెర్చ్ ఇంజన్లు, అడ్వర్టైజ్ లను ఆకర్షించేందుకు యూజర్ల డేటా వాడుకుంటాయని, duckduckgo అలంటి వాటికి దూరంగా ఉంటుందని తెలిపింది.

The new search engine that competes with Google .. Shock if its users know a lot

సెర్చ్ ఇంజన్ లో query ఇచ్చే ఆధారంగా థర్డ్ పార్టీ సోషల్ మీడియా యాప్ లో యాడ్స్ వస్తాయని అని వివరించింది. యూజర్ల ప్రైవసీ కి పెద్ద పీట వేసేలా తాము బిజినెస్ మోడల్ ను ఉపయోగిస్తున్నా మని తెలిపింది. సాధారణంగా మనం బ్రౌజ్ చేసే వెబ్ సైట్ లు మాత్రమే కాకుండా థర్డ్ పార్టీ ట్రాకర్ లు బ్రౌజింగ్, లొకేషన్ ,సెర్చ్, కొనుగోలు వివరాలు సేకరించి బిహేవియర్ ప్రొఫైల్ ను సిద్ధం చేసుకుంటాయి. వాటి ద్వారా మనకు వ్యాపార ప్రకటనలు సూచిస్తాయి. ప్రైవసీ ఎసెన్షియల్ ను వాడటం వల్ల థర్డ్ పార్టీ ట్రాకర్ పనిచేయవని duckduckgo చెబుతోంది. క్రమంగా దీనికి ఆదరణ పెరుగుతోందని టెక్ నిపుణుల అంచనా. ఇప్పటి వరకు కొనసాగిన ఆధిపత్య ధోరణికి ఇకపై పులిస్టాప్ పడేలా ఉంది.


Share

Related posts

బిగ్ బాస్ అఖిల్ కి బంగారం లాంటి అవకాశం…? ఏకంగా విలన్ పాత్రలో

arun kanna

కాజల్ పెళ్లి ఏ సంప్రదాయంలో జరిగిందో తెలుసా..?

Teja

Diabetes: ఈ ఆకులు ఇలా తీసుకుంటే డయాబెటిస్ తగ్గుతుంది..!

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar