NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

బాల‌య్య చిన్న‌ల్లుడు ప్లాన్ బీ ఇదే… గంటాతో క‌య్యానికి రెడీ…!

సినీ హీరో నంద‌మూరి బాల‌కృష్ణ చిన్న‌ల్లుడు, ఇటు లోకేష్‌కు స్వ‌యానా తోడ‌ళ్లుడు అయిన గీతం విద్యా సంస్థ‌ల అధినేత మొతుకుమిల్లి శ్రీ భ‌ర‌త్ ఇప్పుడు ప్లాన్ బీ రాజ‌కీయం అమ‌లు చేస్తున్న‌ట్టు విశాఖ రాజ‌కీయాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. శ్రీ భ‌ర‌త్ గ‌త పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో విశాఖ నుంచి టీడీపీ క్యాండెట్ గా ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నిక‌ల్లో భ‌ర‌త్ ఎంపీ ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ చేతిలో కేవ‌లం 3 వేల ఓట్ల స్వ‌ల్ప తేడాతో ఓడిపోయారు. విశాఖ న‌గ‌రంలోని నాలుగు స్థానాల‌ను టీడీపీ గెలుచుకున్నా కూడా విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని ఎస్ కోట అసెంబ్లీ సీటు నుంచి వైసీపీకి భారీ మెజార్టీ రావ‌డంతో భ‌ర‌త్ స్వ‌ల్ప తేడాతో ఓడిపోవాల్సి వ‌చ్చింది.

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయినా కూడా భ‌ర‌త్ పార్ల‌మెంటు స్థానాన్నే అంటి పెట్టుకుని వ‌స్తున్నారు. ఈ ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెలిచి ఈ సారి పార్ల‌మెంటులో అడుగు పెట్టాల‌ని ఎంతో ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. అయితే ఈ సారి భ‌ర‌త్ సీటు కు గ‌ట్టి పోటీ నెల‌కొంది. ఇప్ప‌టికే జ‌న‌సేన‌తో టీడీపీ పొత్తు ..ఆ త‌ర్వాత బీజేపీతో కూడా పొత్తు పెట్టుకున్న ప‌రిస్థితి. ఈ రెండు పార్టీలు కూడా విశాఖ పార్ల‌మెంటు సీటు కోసం గ‌ట్టిగా ప్ర‌య‌త్నాలు చేశాయి. చంద్ర‌బాబు అన‌కాప‌ల్లి సీటు జ‌నసేన‌కు వ‌దులుకున్నారు.

ఆ త‌ర్వాత బీజేపీ కూడా పొత్తులోకి రావ‌డంతో ప‌వ‌న్ తాను తీసుకున్న అన‌కాప‌ల్లి పార్ల‌మెంటు సీటును బీజేపీకి త్యాగం చేశారు. అయితే బీజేపీ విశాఖ సీటే త‌మ‌కు కావాల‌ని గ‌ట్టిగా ప‌ట్టుబ‌డుతోంది. అక్క‌డ నుంచి 2014 ఎన్నిక‌ల్లో పోటీ చేసిన కంభంపాటి హ‌రిబాబు ఎంపీగా గెలిచారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లోనూ ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలిగా ఉన్న ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి అక్క‌డ పోటీ చేశారు. ఒక వేళ ఎంపీ సీటు ద‌క్క‌క‌పోతే శ్రీ భ‌ర‌త్ ప్లాన్ బీ కూడా వేసుకున్నారు.

భీమిలి నుంచి అసెంబ్లీకి పోటీ చేసేలా ప్లాన్ చేసుకున్నారు. అందుకే చంద్ర‌బాబు భీమిలి సీటును ఇంకా ప్ర‌క‌టించ‌లేదంటున్నారు. అవ‌స‌రం అయితే గంటాను చీపురుప‌ల్లికి అయినా పంపించేసి భీమిలి సీటును శ్రీ భ‌ర‌త్‌కే ఇవ్వాల‌న్న‌ది బాబు ప్లాన్‌. ఇదంతా శ్రీ భ‌ర‌త్ కోస‌మే అని అంటున్నారు. ఇక భ‌ర‌త్ గ‌త ఎన్నిక‌ల్లో ఎంపీగా పోటీ చేస్తే భీమిలి నుంచి భ‌ర‌త్‌కు మంచి మెజార్టీ వ‌చ్చింది. అందుకే భ‌ర‌త్ ఈ సారి ఎంపీ లేక‌పోతే ఎమ్మెల్యేగా అయినా గెలిచి చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్లాల‌న్న పంతంతో ఉన్నాడ‌ని అంటున్నారు. మ‌రి భ‌ర‌త్ ఆశ‌లు ఎంత వ‌ర‌కు నెర‌వేర‌తాయో ? చూడాలి.

Related posts

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?