రాహుల్ గాంధీకి ప్రశంసలు!

కాలు జారి కిందపడిన ఒక ఫొటోగ్రాఫర్‌ను  కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పట్టుకుని పైకి లేపిన సంఘటనకు ట్విట్టర్‌లో మంచి స్పందన లభించింది. శుక్రవారం రాహుల్ భువనేశ్వర్ పర్యటనకు వెళ్లారు. అక్కడ విమానాశ్రయంలో తన పర్యటన కవర్ చేస్తున్న ఫొటోగ్రాఫర్ ఒకరు మెట్ల మీది నుంచి వెనక్కు పడిపోయారు. రాహుల్ వ్యక్తిగత సిబ్బంది వెంటనే స్పందించారు. అయితే రాహుల్ కూడా గబగబా మెట్లు దిగి అతనిని పైకి లేపారు. ఈ సంఘటనపై ట్విట్టర్‌లో రాహుల్‌కు అభినందనలు అందాయి. కొన్ని విమర్శలు కూడా వచ్చాయి.

video courtesy; ANI