NewsOrbit
న్యూస్

Uttarakhand : దేవభూమికీ ఎం అయ్యింది? ముంచుకోస్తున్న ప్రమాదం!

Uttarakhand : భారతదేశ దేవభూమిగా పిలుచుకునే ఉత్తరాఖండ్ Uttarakhand రాష్ట్రం నానాటికీ ప్రమాదపు అంచులోకి వెళ్లిపోతోంది. అత్యంత అద్భుతమైన ఆలయాలతో ఎక్కువ శాతం కొండప్రాంతాల్లో ఉండే ఉత్తరాఖండ్ రాష్ట్రం కాలుష్యం నుంచి కాపాడమని భక్తుల నుంచి ప్రారంభిస్తే పరిస్థితి వచ్చింది.మానవ తప్పిదాల కారణంగా ఇక్కడ మంచుకొండలు వేగంగా పెరిగి అవి వరదలకు దారితీస్తున్నాయి. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో మూడొంతుల భూమి ప్రమాదంలో ఉందని నిపుణులు చెబుతున్న మాట.

Uttarakhand will most dangerous part in future
Uttarakhand will most dangerous part in future

Uttarakhand ఎప్పుడైనా ప్రమాదమే

హిమాలయ పర్వత శ్రేణుల్లో భారత్ వైపు సుమారు ఐదు వేల హిమానీనదాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వీటిలో ఏకంగా 500 కుపైగా హిమానీనదాలు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కనిపిస్తున్నాయి. నానాటికి ఎక్కువ వున్న కాలుష్యంతో పాటు మంచుకొండల్లో ఏర్పడుతున్న కొన్ని చర్యల వల్ల హిమానీ నదాలు వేగంగా కరుగుతున్నాయి. దీంతో ఇవి ఎప్పుడైనా గట్టు తెంచుకొని ఉత్తరాఖండ్ కు ప్రమాదం తెచ్చిపెట్టొచ్చు అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఉత్తరాఖండ్లో 78 తాలూకాలను గానూ 26 తాలూకాలను ఈ హిమానీనదాల వరద ముప్పు చాలా దారుణంగా ఉంది.

ముఖ్యంగా భాట్ వాడి, జోషిమట్, ధరపుల ప్రాంతాల్లో ఈ వరదలు ముప్పు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడకు ఆధ్యాత్మిక ప్రయాణికులు ఎక్కువగా వస్తుంటారు. చెరువుల పై ఏర్పాటుచేసిన ఆనకట్టలు చాలా బలహీనంగా ఉన్నాయని చిన్న వరద వచ్చిన ఈ స్థితిలో ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ఉత్తరాఖండ్లో కాస్త హిమానీనదాలు కరిగి వరద వచ్చినా అది పెను ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది.

కాలుష్యం వల్లే అసలు ప్రమాదం

అమర్నాథ్ యాత్ర బద్రీనాథ్ యాత్ర కేదార్నాథ్, చార్ ధామ్ , మానస సరోవరం యాత్ర పేరిట ఏటా లక్షల మంది పర్యాటకులు హిమాలయ పర్వత శ్రేణులకు వస్తుంటారు. వీరంతా హిమాలయాలకు వెళ్లాలంటే కచ్చితంగా ఉత్తరాఖండ్ నుంచి మాత్రమే వెళ్లాల్సి ఉంది. దీంతో పర్యాటక వ్యవస్థ ఆయా ప్రాంతాల్లో విపరీతంగా కాలుష్యాన్ని పెంచేసింది. పర్యావరణ అంశాల ను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లు ఏర్పడిన పర్యాటక వసతి సముదాయాలు లతోపాటు రవాణా వాహనాల రాకపోకలు పెరగడం, అడవుల నరికివేత ఇబ్బడిముబ్బడిగా వచ్చిన జల విద్యుత్ ప్రాజెక్టులు అన్నీ కలిసి హిమాలయాలను కాలుష్యపు కోరల్లో కి తీసుకు వెళ్ళాయి. 2000 సంవత్సరం నుంచి 2016 మధ్య హిమాలయాల్లో భూతాపం 0.4 డిగ్రీల సెల్సియస్ నుంచి 1.4 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగిందని అధ్యయనాలు చెబుతున్నాయి.

కేవలం ఉత్తరాఖండ్ రాష్ట్రం విద్యుత్ అవసరాలకు 10 వేల మెగావాట్ల ఉత్పత్తి కి గాను 70 పైగా జల విద్యుత్ కేంద్రాలకు ప్రభుత్వం ఇటీవల అనుమతి ఇచ్చింది.అవన్నీ హిమానీనదాలు చిన్నచిన్న నదుల మీద నిర్మిస్తున్న వే. భూతాపం కారణంగా పర్వతశ్రేణుల్లో మంచి వేగంగా కరగడం తో ఈ మధ్యకాలంలో కొత్త మంచినీటి సరస్సులు ఏర్పడడం కనిపిస్తోంది.

ఇవి కొన్ని కొన్ని భారీగా ఉండడంతో పాటు వాతావరణంలో వచ్చే మార్పులు బట్టి ఒక్కసారిగా కట్టలు తెంచుకొని కిందికి వరదలు రూపంలో వస్తున్నాయి. దీంతో మరింత ప్రమాదం ప్రతిసారి అనుకోని వరదలు ఉత్తరాఖండ్ ముంచెత్తుతున్నాయి. దీనిపై చాలా తేలికగా తీసుకుంటే దేవభూమి వచ్చే భవిష్యత్తు కాలంలో కనుమరుగయ్యే అవకాశం ఉందని సైతం శాస్త్రవేత్తలు హెచ్చరించడం ఇక్కడ ప్రధాన అంశం.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju