NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

vizag steel plant విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగబోదన్న కేంద్రం !ఏపీ ప్రభుత్వానికి సంబంధమే లేదని స్పష్టీకరణ!

AP Politics : News Strategy

vizag steel plant విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. 100 శాతం పెట్టుబడులు ఉపసంహరించుకోనున్నట్లు వెల్లడించింది. వైసీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇచ్చారు. మెరుగైన ఉత్పాదకత కోసమే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నట్లు, ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి పెంపు కోసమే..ప్రైవేటీకరణ అని తెలిపారు. జనవరి 27వ తేదీన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ నిర్ణయం తీసుకుందని నిర్మల తెలిపారు.ఇప్పటి వరకు ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని వైసీపీ ప్రభుత్వం చెబుతూ వస్తోంది.

 

vizag steel plant
vizag steel plant

ఏపీ ప్రభుత్వానికి సంబంధమే లేదట! vizag steel plant

అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేదని, ప్రభుత్వం సహకారం అవసరమైనప్పుడు తీసుకుంటామని కేంద్రం వెల్లడించింది. మెరుగైన నిర్వాహణ చేపట్టవచ్చని, ప్రైవేటీకరణ వల్ల స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి పెరుగుతుందని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. పరోక్షంగా, ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని, భాగస్వాములు, ఉద్యోగుల షేర్లు కొనుగోలు చేసేలా ప్రతిపాదనలు చేస్తున్నట్లు వెల్లడించింది. షేర్స్ కొనుగోలు అగ్రిమెంట్ ఉంటుందని స్పష్టం చేసింది. వైసీపీ ఎంపీలు, ఇతర పార్టీలు, ప్రభుత్వం ఎలా స్పందిస్తునేది ఉత్కంఠ నెలకొంది.

ఇప్పటివరకు జరిగిందేంటి?

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను వంద శాతం ప్రయివేటీకరిస్తున్నట్టు డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే చేసిన ట్వీట్ ఆంధ్రప్రదేశ్‌లో పెను సంచలనం సృష్టిస్తోంది. ఆరు దశాబ్దాలుగా విశాఖ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన ఉక్కు పరిశ్రమ మనుగడపై… పాండే ట్వీట్‌తో నీలినీడలు కమ్ముకున్నాయి.విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు, ఇతర కార్యక్రమాలపైనా ఇటీవలే జరిగిన ఏపీ మంత్రివర్గంలో చర్చ జరిగింది. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది.
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై ప్రధాని నరేంద్రమోదీకి ఏపీ సీఎం జగన్‌ లేఖ రాసిన సంగతి తెలిసిందే. స్టీల్‌ ఫ్యాక్టరీలో పెట్టుబడుల ఉపసంహరణపై పునరాలోచన చేయాలని జగన్‌ ప్రధానిని కోరారు. ప్లాంట్‌ను బలోపేతం చేయడానికి మార్గాలను అన్వేషించాలని విజ్ఞప్తి చేశారు.

ఉక్కు పరిశ్రమ ద్వారా 20 వేల మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారని.. పరోక్షంగా వేలాది మంది జీవనోపాధి పొందుతున్నట్టు లేఖలో తెలిపారు.విశాఖ స్టీల్‌ ప్రైవేటుపరమవుతుందనే వార్తలతో ఏపీలో ఉద్యమాలు కొనసాగుతున్నాయి. కార్మికులు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఉనికి కాపాడుకోవాలంటే స్టీల్‌ ప్లాంట్‌పై పట్టు నిలుపుకోవాల్సిన పరిస్థితి రాజకీయ నేతలది.విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇటీవలే ఏపీలో బంద్ జరిగింది. ఏపీ బంద్ కు బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. ఏపీ బంద్‌లో బీజేపీ పాల్గొనలేదు. వామపక్షాలు, ప్రతిపక్ష టీడీపీ సహా అధికార వైసీపీ పాల్గొంది. ఆయా పార్టీల నేతలు కదం తొక్కారు.ఆయన కేంద్ర ప్రభుత్వ వైఖరిలో ఏమాత్రం మార్పు లేదు. ఎవరి ఆందోళనలను కేంద్రం పట్టించుకోవడం లేదు

author avatar
Yandamuri

Related posts

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!