NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Twitter X: ప్రభుత్వ చర్యలు వ్యతిరేకిస్తున్నాం .. కానీ.. ఢిల్లీ మార్చ్ ఖాతాల నిలిపివేతపై ‘ఎక్స్’ స్పందన ఇలా

Twitter X: ఢిల్లీలో రైతులు చేపట్టిన నిరసనతో ముడిపడిన ఖాతాలను సస్పెండ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై ఎలన్ మస్క్ కు చెందిన ఎక్స్ అనూహ్యంగా స్పందించింది. తొలుత కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పలు ఖాతాలు, పోస్టులను గురువారం ఎక్స్ నిలిపివేసింది. అయితే ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూనే .. భావప్రకటన స్వేచ్చ ను సాకుగా చూపి ఇలాంటి పోస్టులను నిలిపివేయొద్దని తెలిపింది.

ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా .. దేశం (ఇండియా) లో మాత్రమే రైతుల నిరసనలకు సంబంధించిన ఖాతాలు, పోస్టులను నిలిపివేస్తాం కానీ ఈ చర్యలతో ఎక్స్ విభేదిస్తుందని పేర్కొంది. భావప్రకటన స్వేచ్చను విస్తరింపజేయాలని కోరుతున్నామని చెప్పింది. చట్టపరమైన పరిమితుల కారణంగా, ప్రభుత్వ ఉత్తర్వులను ప్రచురించలేకపోయామని, కానీ పారదర్శకతకు వాటిని పబ్లిక్ చేయడం చాలా  అవసరమని చెప్పింది. లేకపోతే అది ఏకపక్ష నిర్ణయం తీసుకోవడానికి దారి తీస్తుందని స్పష్టం చేసింది.

కాగా, ఢిల్లీ చలో మార్చ్ కు సంబంధించి 177 ఖాతాల సస్పెండ్ చేయాలని ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం, రెడ్డిట్, ఎక్స్ లకు   ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ నెల 14న ఆదేశాలు జారీ చేసింది. ఈ ఖాతాలు అన్నింటినీ బ లాక్ చేయాలని కోరింది. ఈ నేపథ్యంలోనే ఎక్స్ ఈ విధంగా ప్రకటన విడుదల చేయడం విశేషం.

మరో పక్క పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్దత, వ్యవసాయ రుణాల రద్దుతో సహా ఇతర డిమాండ్ లపై రైతు సంఘాలు, కేంద్ర మంత్రుల మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో రైతులు పోరుబాట కొనసాగిస్తున్నారు. పంజాబ్ – హరియాణా సరిహద్దులోని శంఖు, ఖనౌరీ బోర్డర్ పాయింట్లు రైతులు, పోలీసుల మధ్య ఘర్షణతో దద్దరిల్లాయి. భారీ సంఖ్యలో ట్రాక్టర్ ట్రాలీలు, మినీ వ్యాన్లు, జేసీబీలపై నిరసన కారులు తరలివచ్చారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Jahnavi Kandula: ఆమెరికాలో ఏపీ విద్యార్ధిని జాహ్నవి మృతికి కారణమైన పోలీసుకు క్లీన్ చిట్..?

author avatar
sharma somaraju Content Editor

Related posts

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

AP SSC Results: ఏపీలో టెన్త్ ఫలితాలు వచ్చేశాయోచ్ .. పార్వతీపురం మన్యం ఫస్ట్ .. కర్నూల్ లాస్ట్.. రిజల్ట్స్ ఇలా తెలుసుకోండి

sharma somaraju

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Maldives Parliamentary Elections: మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో ముయిజ్జు పార్టీ హవా

sharma somaraju

Lok Sabha Elections 2024: భారీ భద్రత నడుమ మణిపూర్ లో కొనసాగుతున్న రీపోలింగ్

sharma somaraju

కిష‌న్‌రెడ్డిని ద‌గ్గ‌రుండి మ‌రీ గెలిపిస్తోన్న కేసీఆర్, రేవంత్‌..!

2019కు రివ‌ర్స్‌లో… గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ఆ నాలుగు ఎంపీ సీట్ల ఫ‌లితాలు…!

రాజమండ్రి సిటీలో వైసీపీ భ‌ర‌త్ Vs టీడీపీ వాసు… హీరో ఎవరో తేలిపోయిన‌ట్టే…?

రాజమండ్రి రూరల్ రిపోర్ట్‌: ‘ టీడీపీ బుచ్చయ్య ‘ గెలుస్తాడా…?

Congress: ఏపీలో మరో 9మందితో కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్ధుల ప్రకటన

sharma somaraju

AP Elections 2024: అనపర్తి నుండి పోటీ చేసేది బీజేపీ అభ్యర్ధే .. కానీ ..సమస్య పరిష్కారం అయ్యింది ఇలా..!

sharma somaraju