మరో సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టిన వైయస్ జగన్ సర్కార్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు పేద వాళ్ళ బతుకులు దిశ దశ మార్చేస్తున్నాయి. కులం, మతం, పార్టీ అదేవిధంగా ప్రాంతీయ భేదాలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి వైసీపీ సర్కార్ అందిస్తున్న సంక్షేమ పథకాలు ఎంతగానో తోడ్పడుతున్నాయి. అంతే కాకుండా ఉన్నత చదువులు పేద వాళ్లకు కూడా అందుబాటులో ఉండే రీతిలో పాఠశాలల రూపురేఖలు మార్చిన జగన్ సర్కార్ వైద్య రంగంలో కూడా అనేక మార్పులు మెరుగైన వైద్యం పేదవాళ్లకు అందే రీతిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు.

After exiting the Modi govt, TDP trains its guns on Jaganmohan Reddyదీనిలో భాగంగా తాజాగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరిట రాష్ట్రంలో “వైఎస్సార్‌ అర్బన్‌ క్లినిక్‌”లు ఏర్పాటు చేయటానికి జగన్ సర్కార్ రెడీ అయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 560 వైఎస్సార్ అర్బన్ క్లినిక్‌లకు సర్కార్ అనుమతులు ఇచ్చింది. క్లీనిక్‌ల కోసం 355 కొత్త భవనాలను నిర్మించాలని జగన్ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.

 

అంతేకాకుండా రాష్ట్రంలో 205 ప్రభుత్వ వైద్య భవనాలకి మరమ్మతులు చేసే విధంగా వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇదే సందర్భంలో వైఎస్సార్‌ క్లినిక్‌ల నిర్మాణానికి జాతీయ ఆరోగ్య మిషన్, రాష్ట్ర ఆరోగ్యశాఖ నుంచి ప్రభుత్వం నిధులు మంజూరు చేయనుంది. ఈ వైయస్సార్ క్లినిక్ సెంటర్లు ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కారు ఆధ్వర్యంలో నడుస్తున్న మొహల్లా క్లినిక్ తరహాలో ఉంటాయి. ఢిల్లీలో సామాన్య ప్రజలు జ్వరం, చిన్నాచితక రోగాలు వస్తే ప్రయివేట్ హాస్పిటళ్లకు వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టే పరిస్థితి ఉండదు. పేదలకు వైద్యం భారం కావొద్దనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పేదవాళ్ళు చిన్నచిన్న రోగాలకు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు వేలవేల ఖర్చు చేయకుండా జగన్ సర్కార్ క్లినిక్ సెంటర్ ల తో వారికి వైద్యం కల్పించడానికి పూనుకుంది.