NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధుల తుది జాబితా ప్రకటనకు మూహూర్తం ఖరారు..ఎప్పుడంటే..?

YSRCP: సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో ఏపీలో ప్రధాన రాజకీయ పక్షాలు అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు పూర్తి చేస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ – జనసేన 99 మంది అభ్యర్ధులతో తొలి జాబితా విడుదల చేసింది. రేపు మరో 30 మంది అభ్యర్ధులను ప్రకటించేందుకు టీడీపీ సిద్దమవుతోంది.

తాజాగా వైసీపీ తమ అభ్యర్ధుల జాబితాను వెల్లడించేందుకు సిద్దమవుతోంది. ఈ నెల 16వ తేదీన ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్ధుల తుది జాబితాను వెల్లడించనున్నట్లు వైసీపీ తెలిపింది. విడతల వారీగా కాకుండా ఒకే సారి మొత్తం సీట్లను వైసీపీ ప్రకటించనుంది. గెలుపు గుర్రాలే లక్ష్యంలో ఇప్పటికే కసరత్తు చేసిన వైసీపీ..దాదాపు 70కి పైగా నియోజకవర్గాల్లో ఇన్ చార్జిల మార్పులు చేర్పులు చేసింది. తాజాగా నియమింపబడిన ఇన్ చార్జిలనే అభ్యర్ధులుగా ప్రకటించనుంది.

AP Employees JAC to meet cm jagan tomorrow
 cm jagan

ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద అభ్యర్ధుల జాబితాను సీఎం వైఎస్ జగన్ స్వయంగా ప్రకటిస్తారని వైసీపీ పేర్కొంది. గత ఎన్నికలకు ముందు కూడా ఇడుపులపాయ నుండే సీఎం జగన్ అభ్యర్ధుల ప్రకటన చేశారు. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ తో ఇడుపులపాయ లో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన తర్వాత అభ్యర్ధుల ప్రకటన చేయనున్నారు.

ఇక అభ్యర్ధుల ప్రకటన తర్వాత ఉత్తరాంధ్ర నుండి వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు. మార్చి 18న ఇచ్చాపురం నుండి వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. రోజుకు రెండు లేదా మూడు బహిరంగ సభలు, రోడ్ షోలలో సీఎం జగన్ పాల్గొనేలా వైసీపీ షెడ్యుల్ రూపకల్పన చేస్తొంది.

తొలి రోజు ఇచ్చాపురం, విజయవాడ వెస్ట్, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో జగన్ ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించనున్నారు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలను కవర్ చేసేలా ఇప్పటికే పార్టీ ముఖ్యనేతలు రూప్ మ్యాప్ పైన చర్చించినట్లు తెలుస్తొంది.

BJP: 72 మందితో బీజేపీ రెండో జాబితా విడుదల .. తెలంగాణ నుండి ఈ ఆరుగురికి చోటు

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju