NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: జగనన్నను చెల్లి షర్మిలమ్మ అంత మాట అనేసిందే..!

YS Sharmila: కాంగ్రెస్ పార్టీ తన కుటుంబాన్ని చీల్చి రాజకీయాలు చేస్తుందంటూ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై షర్మిల తీవ్రంగా స్పందించారు. జిల్లాల పర్యటనలో భాగంగా కాకినాడలో ఇవేళ పార్టీ కార్యకర్తలు, నేతలతో సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా జగన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ .. వైఎస్ కుటుంబం చీలింది అంటే దానికి కారణం .. చేజేజులా జగనన్న చేసుకున్నదేనని కుండబద్దలు కొట్టారు. అందుకు సాక్ష్యం దేవుడు, తన తల్లి విజయమ్మ, యావత్ కుటుంబం అని పేర్కొన్నారు. వైసీపీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు జగనన్న వెంట నడిచి 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని, వాళ్లను మంత్రులను చేస్తానని చెప్పి మోసం చేశాడని అన్నారు.

వైసీపీ కష్టాల్లో ఉందని పాదయాత్ర చేయమంటే తాను ఇంటిని, పిల్లలకు పక్కన పెట్టీ…ఎండనక, వాన అనక రోడ్ల మీదనే ఉన్నానని షర్మిల గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత సమైక్య యాత్ర కోసం అడిగితే ప్రజల బాగు కోసమే కాదా అని ఆ యాత్ర కూడా చేశానని చెప్పారు. తెలంగాణలో కూడా ఓదార్పు యాత్ర చేశానని అన్నారు. ఎప్పుడు అడిగితే అప్పుడు మాట కూడా మాట్లాడకుండా అండగా నిలబడ్డానని చెప్పారు. ఎందుకు అని అడగకుండా, స్వలాభం  చూడకుండా, నిస్వార్థంగా ఏది అడిగితే అది చేశానని తెలిపారు. గత ఎన్నికల్లో బై బై బాబు అంటూ ఊరూరా తిరిగాననీ, దేశంలోనే మిస్ట్ సక్సెస్ ఫుల్ క్యాంపెయిన్ చేసి జగనన్నను గెలిపించానన్నారు.

జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వేరే మనిషిగా మారిపోయారని షర్మిల అన్నారు. నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు అనుకున్నా, తాను మంచి ముఖ్యమంత్రి అయితే చాలు ..వైఎస్ఆర్ పేరు,  ఆశయాలను నిలబెడితే చాలు అనుకున్నానని అన్నారు. వైఎస్ఆర్ పేరు నిలబెడతాడు అనుకున్నానని చెప్పారు. ఈ అయిదేళ్లలో ముఖ్యమంత్రితో సహా అందరూ బీజేపీ కి బానిసలు గా మారారని విమర్శించారు. బీజేపీ కి ఒక్క ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు అయినా ఏపిలో బీజేపీ రాజ్యం ఏలుతుందని అన్నారు. జగన్ వైసీపీని, రాష్ట్రాన్ని బీజేపీ దగ్గర తాకట్టు పెట్టాడని విమర్శించారు.

పోలవరం వైఎస్ఆర్  డ్రీమ్ ప్రాజెక్ట్, అంతకు ముందు ఏ ప్రభుత్వాలు చేయని సాహసం వైఎస్ఆర్ చేశారు. వైఎస్సార్ 2004 లో ముఖ్యమంత్రిగా ఆయిన ఆరు నెలల్లో ప్రాజెక్ట్ పనులు మొదలు పెట్టారు. వైఎస్సార్ హయాంలో 4500 కోట్లు ఖర్చు పెట్టి కాలువలు తవ్వించారు. 8 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు,12 లక్షల ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంగా చేపడితే వైఎస్సార్ మరణించిన తర్వాత… టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్ట్ ను నిరక్ష్యం చేశాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పోలవరం ప్రాజెక్ట్  కు జాతీయ హోదా ఇచ్చిందని చెప్పారు. బాబు అధికారంలో వచ్చాక అంచనా వ్యయం 30 వేల కోట్లకు పెంచాడే తప్పా ఉపయోగం లేదని అన్నారు.

వైఎస్సార్ పనితీరు మీలో కల్పిస్తే మీరు వైఎస్సార్ వారసులు అవుతారని అన్నారు. వైఎస్ఆర్ హయాంలో వ్యవసాయం ఒక పండుగ అయితే జగనన్న ప్రభుత్వంలో వ్యవసాయం దండుగ అయ్యిందని షర్మిల విమర్శించారు. వైఎస్సార్ పథకాలు ఒక్కటి కూడా అమలు కావడం లేదని అన్నారు. ఇది రైతు రాజ్యం కాదు..వైఎస్సార్ సుపరిపాలన అంతకన్నా కాదని అన్నారు. ఉద్యోగాలు లేవు ..నోటిఫికేషన్ లు ఇవ్వరు అని విమర్శించారు. 30 వేల టీచర్ ఉద్యోగ పోస్ట్ లు భర్తీ చేయాల్సి ఉండగా నోటిఫికేషన్ లేదని అన్నారు.  వైఎస్సార్ ప్రజల మనిషిగా ప్రజల మధ్యే బ్రతికాడనీ, ఇప్పుడు జగన్ ఒక నియంతగా, పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నాడనీ, ప్రజలకు కనపడరు ..ఎ మ్మెల్యేలను కలవరు. మీరా రాజశేఖర్ రెడ్డి వారసులు అని ప్రశ్నించారు.

వైఎస్సార్ హయాంలో నష్టపోతున్న కంపెనీలను ప్రభుత్వ పరం చేయించారనీ, మీరు ఉన్న ఆస్తులను అమ్ముతున్నారని అన్నారు. వైఎస్సార్ పేరును చెడగొట్టింది జగన్ అని విమర్శించారు. ఎంతో మంది త్యాగాలు చేస్తే జగన్ ముఖ్యమంత్రి అయ్యారన్నారు. నా అనుకున్న వాళ్ళను అందరినీ దూరం చేశారన్నారు. వైఎస్సార్ పాలనకు జగన్ ఆన్న పాలనకు నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు. నేను కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు సోనియా గాంధీ గారిని కలిశాననీ, వాళ్ళు వైఎస్సార్ పై పెట్టుకున్న ప్రేమ అభిమానాన్ని చూశానని చెప్పారు. వైఎస్సార్ ఉంటే కాంగ్రెస్ కి ఈ పరిస్థితి వచ్చేది కాదు అని వారు అన్నారన్నారు. వైఎస్సార్ కుటుంభం లో జరిగిన అన్యాయానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు.

నన్ను కాంగ్రెస్ ఏపికి వెళ్ళమంటే పని చేయాలని నిర్ణయించుకున్నానని షర్మిల చెప్పారు. ఇక్కడ బీజేపీ చేస్తున్న తెర వెనుక రాజకీయాలను తెలుసుకున్నా, ప్రజలకు జరుగుతుంది అన్యాయం కాబట్టి…నేను ఇక్కడ పని చేయాలని అనుకున్నా, ఇది వ్యక్తిగత నిర్ణయం కానే కాదని అన్నారు. ఈ నిర్ణయం తో నేను టార్గెట్ అవుతానని, నన్ను ఎటాక్ చేస్తారని తెలుసు. నా కుటుంభం నిట్ట నిలువునా చీలుతుంది అని తెలుసు అయినా నేను తీసుకున్న నిర్ణయం ప్రజల కోసమేనని చెప్పారు. నిజానికి ఆంధ్ర రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా దయనీయ స్థితిలో ఉంది అంటే చంద్రబాబు, జగనన్నే కారణమని షర్మిల అన్నారు.

YS Jagan: గిరిజన ప్రాంతాల్లో 300 సెల్ ట‌వ‌ర్లను ప్రారంభించిన సీఎం జ‌గ‌న్‌

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri