NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Ap CID: రఘురామకృష్ణంరాజు పై మాత్రమే కాక ఆ రెండు ఛానల్స్ పై కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ..!!

RaghuramakrishnamRaju Case: Comedian or Hero..!? KLey Analysis

Ap CID: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ని నిన్న హైదరాబాదులో ఆయన సొంత నివాసంలో ఏపీ సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకోవడం తెలిసిందే. 124 ఏ, 153 బి, 505 ఐపీసీ, 120 సబ్ సెక్షన్ బి కింద ఏపీ సిఐడి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగింది. కరోనా నేపథ్యంలో తప్పుడు సమాచారం ద్వారా ప్రజలలో భయాందోళనలు రేకెత్తించకూడదని.. తప్పుడు ప్రచారం చేయకూడదని అట్లా చేస్తే నేరమనీ కేంద్రం ఇటీవల తెలపడం జరిగింది. ఇదే తరహాలో రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు గత కొన్ని రోజుల నుండి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

Ap CID Case file against two media channels
Ap CID Case file against two media channels

కరోనా వైరస్ ని అడ్డంపెట్టుకుని భయాందోళన రేకెత్తించేలా వ్యాఖ్యలు చేయటం మాత్రమే కాక కొన్ని వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా .. మతాల మధ్య కలహాలు సృష్టించేలా వ్యవహరించారని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.  ఆయన పై మాత్రమే కాక .. రఘురామకృష్ణంరాజు ని మీడియా లో గత కొన్నాళ్ల నుంచి కవర్ చేస్తున్న టీవీ5, ఏబీఎన్ ఛానల్ లపై కూడా ఏపీ సీఐడీ తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. రఘురామకృష్ణంరాజు తన వ్యాఖ్యలతో సమాజంలో రెడ్డి సామాజిక వర్గాని అదేవిధంగా క్రైస్తవ మతాన్ని టార్గెట్ చేసుకుని.. సమాజంలో విద్వేషాలు..  రెచ్చగొట్టేలా గొడవలు సృష్టించేలా వ్యవహరించారని .. ఈయనతోపాటు టీవీ5, ఏబీఎన్ మీడియా ఛానల్స్ ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై బురదజల్లే విధంగా వ్యవహరించారని ఏపీ సీఐడీ.. ఈ రెండు మీడియా ఛానల్స్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

 

Ap CID Case file against two media channels
Ap CID Case file against two media channels

గత కొన్ని రోజుల నుండి “రాజధాని రచ్చబండ” అంటూ తన సోషల్ మీడియాలో రఘురామకృష్ణంరాజు తీవ్రస్థాయిలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కొన్ని సామాజిక వర్గాలను మాత్రమే కాక మతాలను కూడా రఘురామకృష్ణంరాజు టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం జరిగింది. ఈ పరిణామంతో ఏపీ సీఐడీ ఆయన పై మాత్రమే కాక .. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కవర్ చేస్తూ వస్తున్న చానెల్స్ పై కూడా యాక్షన్ తీసుకోవటం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా వ్యవహరించారని ఏపీ సిఐడి ఎఫ్ఐఆర్లో వెల్లడించింది. ఇదే క్రమంలో ఆయనకి టీవీ ఫైవ్ ఛానల్ ప్రతినిత్యం ఫ్లాట్ కేటాయించడం జరిగిందని, అదే రీతిలో ఏబీఎన్ ఛానల్ పెద్దలతో కలిసి కూడా రఘురామకృష్ణంరాజు కుట్రపూరితంగా ప్రభుత్వంపై రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినట్లు ఏపీ Cid  ఎఫ్ఐఆర్లో వెల్లడి చేసింది.

author avatar
P Sekhar

Related posts

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?