NewsOrbit
రాజ‌కీయాలు

చంద్రబాబు చాణిక్య రాజకీయం జగన్ కూడా యాజిటీజ్ దించేశాడు…

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చాణిక్య రాజకీయాన్ని వైకాపా అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవపోసన పట్టినట్లున్నారు. 2014 ఎన్నికల తరువాత చంద్రబాబు అధికారంలోకి రాగానే వైకాపాను బలహీన పర్చేందుకు ఆ పార్టీ నుండి పెద్ద సంఖ్యలో పార్టీ నేతలను టీడీపీలో చేర్చుకొని పార్టీ కండువాలు కప్పారు. వైకాపా నుండి గెలుపొందిన 23మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నారు. అయితే ఇప్పుడు సిన్ రివర్స్ అయ్యింది. టీడీపీ నుండి వైకాపాకు వలసల పర్వం కొనసాగుతోంది. నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అన్నట్టు టీడీపీ నుండి వచ్చే వారికి జగన్ పార్టీ కండువాలు కప్పేస్తున్నారు.

అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సమయంలో పార్టీలో చేర్పులపై ఒక మాట చెప్పారు. చంద్రబాబు మాదిరిగా సంతలో పశువులను కొన్నట్లు ఎమ్మెల్యే లను చేర్చుకొనని చెప్పారు. వైకాపా ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలకు మెచ్చి ఎవరైనా పార్టీలో చేరవచ్చని కానీ పదవులకు రాజీనామా చేసిన వారినే చేర్చుకుంటామని తెలిపారు.

రోజులు మారుతున్న నేపథ్యంలో టీడీపీ ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయాలన్న తలంపుతో ఆ కండిషన్ ను పక్కకు పెట్టారు. దీనితో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యే లు వైకాపా పంచన చేరారు. అయితే వీరు వైసీపీ కండువాలు కప్పుకోలేదనే కానీ అసోసియేట్ లుగా ఉంటున్నారు. టీడీపీ నేతలను చేర్చుకోవడం వల్ల సొంత పార్టీ వైకాపాలో అలజడి రేకెత్తుతోంది. నియోజకవర్గాలలో రెండు గ్రూపులు ఏర్పడతాయని, రెండు వర్గాలు కలసి పని చేయడం కష్టమని భావిస్తున్నారు. అయితే పార్టీలో చేరే వారికి జగన్ ఎటువంటి హామీలు ఇవ్వడం లేదని తెలుస్తోంది. హామీల కోసం ప్రయత్నించే వారితో ‘పార్టీ కోసం పని చేయండి అన్నా.. తర్వాత చూద్దాం’ అని సున్నితంగా తప్పించుకుంటున్నారని అంటున్నారు.

చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు తదితర నేతలు చేరిన సమయంలోనూ వారికీ ఎటువంటి హామీలు ఇవ్వలేదని సమాచారం. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం తన కుమారుడికి అద్దంకి నియోజకవర్గం పార్టీ ఇంచార్జ్ గా నియమించాలని కోరుతున్నా..అది దక్కలేదు. మరో పక్క చీరాల నియోజకవర్గం పార్టీ ఇంచార్జ్ గా మాజీ ఎమ్మెల్యే అమంచి కృష్ణమోహన్ కొనసాగుతారని స్పష్టం చేసినట్లు సమాచారం. పార్టీలో చేరే వారికి జగన్ ఎటువంటి హామీలు ఇవ్వకపోవడంతో సొంత పార్టీ వైకాపా నేతలు ఊరట చెందుతున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !