NewsOrbit
రాజ‌కీయాలు

ఆయాసపడుతూ ఆవేశపడుతున్న అవంతి! ఆ భయంతోనే

ఈ మధ్య కాలంలో విశాఖ జిల్లాలోని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ సవాళ్ల మీద సవాళ్లు విసురుతున్నారు.మాట్లాడితే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కూడా అనేస్తున్నారు.

ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది .నిజానికి విశాఖలో వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ తన చిరకాల కోరికగా మంత్రి పదవిని అందుకున్నారు. పైగా ఆయన అయిదేళ్ళు మంత్రిగా కొనసాగాలనుకుంటున్నారు. అంతే కాదు, విశాఖ వంటి పెద్ద జిల్లాకు ఏకైక‌మంత్రిగా కూడా శాసించాలనుకుంటున్నారు. అటువంటి అవంతి శ్రీనివాస్ ఈ మధ్య తరచూ సవాళ్ళు చేస్తున్నారు. అది కూడా తన మంత్రి పదవి మీదనే చేస్తున్నారు. అలా ఎందుకు అవంతి శ్రీనివాస్ చేస్తున్నారన్న దానిపై విశ్లేషణగా సవాళ్ళతో, చంద్రబాబు మీద విమర్శలతో తన పదవిని నిలబెట్టుకునే ఎత్తుగడలకు మంత్రి పాల్పడుతున్నారని సొంత పార్టీలో వినిపిస్తున్న మాట.వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖలో భూ కబ్జాలు పెరిగాయని, గజం స్థలానికి కూడా గ్యారంటీ లేదని చంద్రబాబు నుంచి మాజీటిడిపి మంత్రుల వరకు అందరూ ఆరోపిస్తుండగా విశాఖలో ఒక్క గజం స్థలంలో భూకబ్జా జరిగిందని నిరూపించినా తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని హూంకరిస్తున్నారు. అనాలని టీడీపీ అంటూంటే మంత్రి అవంతి శ్రీనివాస్ మాత్రం మరింతగా రెచ్చిపోతున్నారు. ఇలా సవాళ్ళు చేస్తున్నా కూడా అవంతి శ్రీనివాస్ ని ఇటు టీడీపీ కానీ, అటు వైసీపీ నేతలు కానీ సీరియస్ గా తీసుకోకపోవడమే ఇక్కడ కామెడీ.ఎటూ రెండేళ్ల తరువాత మంత్రి పదవి పోతుందని, ఇంతలో రంకెలు ఎందుకు అని వారు సెటైర్లు వేస్తున్నారు. అయితే జగన్ వద్ద ఇవేమీ సాగవని, పనితీరు ఆధారంగానే ఆయన పదవులు ఇస్తారని, ఇలా షార్ట్ కట్ మెథడ్స్. అవుట్ డేటెడ్ రాజకీయాలతో మంత్రిపదవి కొనసాగింపునకు గ్యారంటీ ఇవ్వరని కూడా సొంత పార్టీ వారేచెబుతున్నారు. మొత్తమే అవంతి శ్రీనివాస్ వ్యవహారం విశాఖ జిల్లా రాజకీయ వర్గాల్లో హాస్యాస్పదమైన చర్చలకు తావిస్తోంది



author avatar
Yandamuri

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !