Janasena Pavan kalyan: పవన్ మళ్ళీ ఏడాది తర్వాతే జనంలోకి..! అప్పుడు ఒక ట్విస్టుతో..!?

Janasena Pavan kalyan: Political Plannings, twists in 2023
Share

Janasena Pavan kalyan: జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పట్లో మళ్ళీ జనంలోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు.. సినిమాలు ఎక్కువగా షెడ్యూల్ లో పెట్టుకోవడం.., రాజకీయంగా ఒక గందరగోళ పరిస్థితుల్లో ఉండడంతో ఏడాది వరకు రాజకీయ సమావేశాలు, సభలకు, ప్రయాణాలకు దూరంగా ఉండాలని పవన్ భావిస్తున్నట్టు సమాచారం.. దీనికి స్పష్టమైన అధరాలు కూడా చెప్పుకోవచ్చు.. ఏడాది తర్వాత కూడా ఆయన ఒక పెద్ద పొలిటికల్ ట్విస్టుతో జనంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్నారు..!

Janasena Pavan kalyan:  చేతిలో మూడు సినిమాలు..! తర్వాతే..!!

ఇది 2021 మరో మూడు, నాలుగు నెలలు కరోనాతో గడిచిపోతుంది. ఆ తర్వాత ఆయన వరుసగా సంతకాలు చేసేసి.., పెండింగ్ లో పెట్టుకున్న సినిమాల షూటింగులు ఉన్నాయి. “క్రిష్ దర్శకత్వంలో హరహరవీరమల్లు.., దగ్గుబాటి రానాతో కలిసి అయ్యప్పయుమ్ కోశియుము రీమేక్.., ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా కమిట్ అయ్యారు. ఈ మూడు షూటింగ్ పూర్తి అయ్యేసరికి వచ్చే ఏడాది జూన్ వరకు పట్టొచ్చు. అయితే అప్పటి వరకు పూర్తిగా పార్టీకి, నాయకులకు, రాజకీయాలకు దూరంగా ఉంటారని కాదు.. అవన్నీ అంతర్గతంగా చక్కబెడతారు. కానీ జనంలోకి మాత్రం ఇప్పట్లో రారు. వచ్చే ఉద్దేశం, ప్రణాళిక లేదు. అందుకు సినిమాల్లో బిజీతో పాటూ… కొన్ని రాజకీయ అడుగుల మార్పుల కారణాలు కూడా ఉన్నాయి..!

Janasena Pavan kalyan: Political Plannings, twists in 2023
Janasena Pavan kalyan: Political Plannings, twists in 2023

2023 నాటికి కొన్ని కీలక ప్రణాళికలతో..!!

ఈ మూడు సినిమాలు పూర్తయ్యాక .. ఈ లోగా బీజేపీతో పవన్ కలిసి నడిచేది.. లేనిది తేలిపోతుంది. ఈ ఇద్దరి పొత్తులో పవన్ వలన బీజేపీకీ … బీజేపీ వలన పవన్ కళ్యాణ్ కీ ఒరిగింది ఏమీ లేదు. మొన్నటి తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రాక్టీకల్ గా తేలిపోయింది. ఎవరి బలం ఏమిటో తెలిసిపోయింది. అంతకు ముందు స్థానిక ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఒకరి బలం ఒకరికి అర్ధమైపోయింది. ఈ పొత్తుని ఓటర్లు పెద్దగా పట్టించుకోలేదు. అయిదు + ఒకటి = ఆరు అవుతుంది తప్ప… సోము వీర్రాజు చెప్పేటట్టు 30 అవ్వదు (ఏపీలో 30 శాతం ఓట్లు తమకు వస్తాయని సోము తరచూ అంటుంటారు).. అదే సమయంలో 40 + 5 కలిస్తే… ఈ ఐదుకి, ఆ నలభై కి కొంచెం అన్నీ అనుకూలిస్తే యాభై వరకు అయినా చేసుకోగలమనే ధీమా పవన్ కల్యాన్ ఈ మధ్య కనిపిస్తుంది. అందుకే 2023 నాటికి రాజకీయాల్లో యాక్టీవ్ అయి ఓ కొత్త పొత్తు, కొత్త రాజకీయ మాటలతో జనంలోకి రావాలని భావిస్తున్నారు.

Janasena Pavan kalyan: Political Plannings, twists in 2023
Janasena Pavan kalyan: Political Plannings, twists in 2023

* ప్రస్తుతం బయటకు రాజకీయాలు సైలెంట్ గా ఉన్నప్పటికీ.. ఇటు పవన్ కళ్యాణ్.. అటు టీడీపీ నుండి కూడా కీలక రాయబారులు కొన్ని అంతర్గత చర్చల్లో మునిగితేలుతున్నారు. పవన్ కళ్యాణ్ పై ఎటువంటి విమర్శలు చేయద్దు అంటూ టీడీపీ సోషల్ మీడియాకి నారా లోకేష్ ఇప్పటికే సీరియస్ ఆదేశాలిచ్చారు. మరోవైపు జనసేన సోషల్ మీడియాలో కూడా టీడీపీపై దాడి తగ్గుతూ వస్తుంది. అంచేత కొన్ని కొత్త సంకేతాలతో 2023 లో ఓ భారీ కార్యక్రమాలు, యాత్రలకు ఈ ఇద్దరూ సిద్ధమవుతున్నారు..!


Share

Related posts

Chittoor : హౌస్ మోషన్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా

somaraju sharma

హైవేలపై డ్రైవింగ్ చేస్తున్నారా..!? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!

bharani jella

Revanth Reddy : మోడీ, కేసీఆర్ లపై తీవ్రస్థాయిలో సీరియస్ అయిన రేవంత్ రెడ్డి..!!

sekhar