NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR: కేసీఆర్ తో పేచీ… జాగ్ర‌త్త‌గా డీల్ చేస్తున్న జ‌గ‌న్ టీం

KCR: తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ విష‌యంలో ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతున్నారా? నొప్పింప‌క .. తానొవ్వ‌క అన్న‌ట్లుగా సున్నితంగా డీల్ చేస్తున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావారణం ఏర్పడిన సంగ‌తి తెలిసిందే. ఏపీ అంబులెన్లను స‌రిహ‌ద్దు చెక్ పోస్టు వద్ద తెలంగాణ పోలీసులు అడ్డుకోవడంతో ఆంధ్రావాసులు ఆందోళనకు దిగారు. తెలంగాణ స‌రిహ‌ద్దుల్లో ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్ లను ఆపివేయడంపై ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ న‌మ్మిన‌బంటు, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు.

స‌రిహ‌ద్దుల్లో ఏం జ‌రుగుతోంది?

ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్‌లను సరిహద్దులో తెలంగాణ పోలీసులు ఆపేస్తున్నారు. ఆసుపత్రి అనుమతి, తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఈ-పాస్‌ ఉంటేనే పంపిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ స‌ర్కారుపై విప‌క్షాలు విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. అదే స‌మ‌యంలో హైకోర్టు సైతం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఉదంతంపై ఏపీ ప్ర‌భుత్వం తాజాగా అధికారికంగా స్పందించింది.

జ‌గ‌న్ మ‌నిషి ఏమంటున్నారంటే…

అంబులెన్స్ ను ఆపడం దురదృష్టకరమ‌ని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ ప్రజల గురించి ఆలోచించడం సహజమే కానీ పొరుగు రాష్ట్రం వారి గురించి సైతం ఆలోచించాల‌న్నారు. హైకోర్టు చెప్పినప్పటికీ ప్రభుత్వం సాంకేతికంగా గైడ్ లైన్స్ పెట్టింది. ఆ గైడ్ లైన్స్ ను పాటించడం కష్టం అని అన్నారు. ఏపీ ప్ర‌జ‌లు బెంగళూరు, చెన్నై నగరాలకు వైద్యం కోసం వెళ్తున్నారని, కానీ అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవని పేర్కొన్న స‌జ్జ‌ల తప్పకుండా సమస్య పరిష్కారం అవుతుందని, తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నామని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హాయాంలో రాష్ట్రంలో మౌళిక వసతులు అభివృద్ధి చేయలేదని, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్ లో వైద్యసదుపాయాలు తక్కువే అని అన్నారు.

author avatar
sridhar

Related posts

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N