Sabbham Hari : ఎస్సీ, ఎస్టీలపై దారుణమైన కామెంట్లు చేసిన సబ్బం హరి..!!
Sabbham Hari : తెలుగు రాజకీయాల్లో సబ్బంహరి తెలియని వారు ఎవరు ఉండరు. కాంగ్రెస్ పార్టీలో పార్లమెంటు సభ్యుడిగా రాణించిన సబ్బం హరి విశాఖ జిల్లాలో కీలక నేతగా రాణించడం జరిగింది. ఇటువంటి తరుణంలో ఇటీవల ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం వర్సెస్ రాష్ట్ర ఎన్నికల సంఘం అన్న రీతిలో వ్యవహారం నడుస్తున్న క్రమంలో టీవీ ఛానల్ డిబేట్ లో ఎస్సీ ఎస్టీలపై దారుణమైన కామెంట్లు చేశారు సబ్బంహరి. ఈ రెండు వర్గాలకు చెందిన వారు సీఎం జగన్ చాంబర్లో పైరవీలు జరుపుకుంటున్నారు అంటూ మండిపడ్డారు. గ్రూప్ 1, గ్రూప్ 2 చదువుకొని విజ్ఞత అంతా వదిలేసి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని సబ్బం హరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ, ఎస్టీ ఆర్గనైజేషన్ వీళ్లంతా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి చాంబర్లో ఉంటారని, వాళ్లు పైరవీలు చేసుకునే రీతిలో మాట్లాడుతారని, అలాంటి లక్షణాలు వాళ్ళ లోనే ఉంటాయి అంటూ సబ్బం హరి దారుణమైన కామెంట్ చేశారు. ఇదే క్రమంలో ఒక పద్ధతి లేకుండా సంస్కారం లేకుండా నియంత లాగా జగన్ పరిపాలిస్తున్నారు అంటూ మండిపడ్డారు. దీంతో సబ్బం హరి చేసిన వ్యాఖ్యలు పట్ల దళిత సంఘాలు మండిపడుతున్నాయి. ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఈ విధమైన కామెంట్ చేస్తారని ఆమె చేసిన వ్యాఖ్యలపై దళిత మేధావులు సీరియస్ అవుతున్నారు.