NewsOrbit
రాజ‌కీయాలు

‘టిడిపి డ్రామా కంపెనీ’

అమరావతి: రాష్ట్రంలో యథేచ్ఛగా డబ్బుల పంపిణీ జరుగుతుందని బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. బుధవారం కన్నా లక్ష్మీనారాయణ, ఎంపి జివిఎల్‌ నరసింహారావు, పార్టీ అధికార ప్రతినిధి విజయ్‌ బాబు, తదితరులు సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేదీని కలిసి ఫిర్యాదు చేశారు.

అనంతరం కన్నామీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఈసి తమ ఫిర్యాదులపై చర్యలు తీసుకోవట్లేదని మేము అంటుంటే…ఈసిని రాజకీయ పార్టీలకు అంటగట్టి బ్లాక్ మెయిల్ చేయటం చంద్రబాబు సహజ స్వభావమని కన్నా విమర్శించారు. టిడిపి ఒక పార్టీ కాదనీ, డ్రామా కంపనీ అని కన్నా వ్యాఖ్యానించారు.  ఈసి దగ్గర చంద్రబాబు డ్రామాలాడారని కన్నా పేర్కొన్నారు.

సత్తెనల్లి నియోజకవర్గంలో పోలీసులే టిడిపి తరపున డబ్బులు పంపిణీ చేస్తున్నారని ద్వివేదీకి వివరించామన్నారు. అలాగే గుంటూరు పార్లమెంట్ సభ్యుని కార్యాలయం దగ్గర జర్నలిస్ట్ పై జరిగిన దాడిపై చర్యలు తీసుకోవాలని కన్నా డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో వేల కోట్ల నల్లధనాన్ని అధికార పార్టీ పంచుతోందని జివిఎల్ ఆరోపించారు. ఇప్పటివరకూ 120 కోట్ల రూపాయలు పట్టుకున్నారని అభినందిస్తూ.. ఇది కేవలం కొండత అవినీతిలో గోరంతేననీ జివిఎల్ అన్నారు. ఇంకా చాలా నల్లధనం చేతులు మారుతోందని  జివిఎల్ ఆరోపించారు.

ఈసి వంటి రాజ్యాంగ సంస్థపై రంగు పులిమి రాజకీయంగా వాడుకోవాలనే ప్రయత్నం చేయటం దుర్మార్గమని జివిఎల్ వ్యాఖ్యానించారు.  కొద్ది మంది అధికారులను ఈసి బదిలీ చేస్తే చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.

చంద్రబాబు దిగజారుడు మాటలు రాజకీయ దివాళా కోరుతనమని జివిఎల్ దుయ్యబట్టారు. హైకోర్టు చీవాట్లు పెట్టినా బుద్ధి రాలేదని అన్నారు. చంద్రబాబు ముందుగానే తన ఓటమిని అంగీకరించారని జివిఎల్ వ్యాఖ్యానించారు.

రాజకీయ లబ్ది పొందాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని జివిఎల్ ఆరోపించారు. పోలింగ్‌ రోజున కూడా టిడిపి కుట్రలు పన్నే అవకాశముందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జివిఎల్ సూచించారు.  చంద్రబాబు కావాలనే సోదాలు చేయించుకున్నారనీ, రాష్ట్రంలో జరిగినవి ఐటి సోదాలు కాదనీ,  పోలీసు సోదాలేననీ జివిఎల్ చెప్పుకొచ్చారు.

రాష్ట్రపతి పాలనలో ఎన్నికలు జరిగితే పారదర్శకంగా ఉండేవని జివిఎల్ అభిప్రాయపడ్డారు. ఈ సారి టిడిపికి ప్రతిపక్ష హోదా కూడా రాదని జివిఎల్ జోస్యం చెప్పారు.

 

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

Leave a Comment