NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

GHMC ఎన్నికల విషయంలో తెలంగాణ ఈసీ కీలక నిర్ణయం..!!

జిహెచ్ఎంసి ఎన్నికల విషయంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాలెట్ పద్ధతి లోనే ఎన్నికలు నిర్వహించడానికి రెడీ అయింది. జరగబోయే ఎన్నికల నిర్వహణపై అన్ని పార్టీల అభిప్రాయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకుంది. ఈ నేపథ్యంలో మెజార్టీ పార్టీలు బ్యాలెట్ పద్ధతి కి మొగ్గు చూపినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. గుర్తింపు పొంది రిజిస్టర్ అయిన 50 పార్టీలలో 26 పార్టీలు తమ అభిప్రాయాలను తెలిపాయి.

Hyderabad: Election Commission to use ballot papers for GHMC electionsఈవీఎంల పద్ధతి లో ఎన్నికలు నిర్వహించాలని మూడు పార్టీలు కోరగా… 13 పార్టీలు బ్యాలెట్ విధానానికే మొగ్గు చూపినట్లు తెలంగాణ ఈసీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో నవంబర్లో జిహెచ్ఎంసి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కరోనా వైరస్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటంతో ఈవీఎంల ద్వారా అయితే వైరస్ సోకే ప్రమాదం ఉండే అవకాశం ఉంది. దీంతో బ్యాలెట్ పద్ధతి ద్వారానే అయితే ఓటర్ కి ఎటువంటి వైరస్ సోకే అవకాశం ఉండదని మెజార్టీ పార్టీలు భావించి బ్యాలెట్ పద్ధతికి మొగ్గుచూపినట్లు టాక్.

ఇదిలా ఉండగా ఈ ఎన్నికలలో ఎలాగైనా సత్తా చాటాలని మేయర్ స్థానం కైవసం చేసుకోవాలని ప్రధాన పార్టీలన్నీ రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న టిఆర్ఎస్ మరోసారి సత్తా చాటాలని ఫుల్ గా డిసైడ్ అయ్యింది. కాగా గత జిహెచ్ఎంసి ఎన్నికలు కేటీఆర్ పర్యవేక్షణలో అనేక స్థానాలు గెలవడంతో ఈసారి కూడా ఆయనకే పూర్తి బాధ్యతలు అప్పజెప్పారు కేసీఆర్. దీంతో గతంలో మాదిరిగానే డిజిటల్ స్థాయిలో ఎక్కువ ప్రచారం చేయడానికి కేటీఆర్ అన్ని అస్త్రాలను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇదే తరుణంలో కాంగ్రెస్, బిజెపి పార్టీలు కూడా ప్రభుత్వంపై విమర్శలు తీసుకువచ్చే రీతిలో వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు టాక్. 

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju