వైసిపిలో చేరిన పివిపి, తోట

హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ (పివిపి), కాకినాడకు చెందిన టిడిపి ఎంపి తోట నరసింహాం, సినీనటుడు రాజా రవీంద్రలు బుధవారం వైసిపిలో చేరారు. హైదరాబాదు లోటస్ పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వీరికి వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా స్వాగతించారు.

ఎంపి తోట నర్శింహం పెద్ద సంఖ్యలో తన అనుచరులతో కలిసి వెళ్లి వైసిపిలో చేరారు. పార్టీలో చేరిన నాయకులందరికీ జగన్ కండువాలు కప్పిసాదరంగా ఆహ్వనించారు.

పొట్లూరి వరప్రసాద్ (పివిపి)కి విజయవాడ పార్లమెంట్ సీటు ఖరారు చేసినట్లు సమాచారం. టిడిపి ఎంపి తోట నర్శింహం భార్య వాణిని పెద్దాపురం అసెంబ్లీ నుండి పోటీ చేయించనున్నారు. పార్టీలో చేరిన సినీనటుడు రాజా రవీంద్ర  పార్టీ అభ్యర్థుల విజయానికి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్లొననున్నట్లు సమాచారం.