అమరావతి: అసెంబ్లీ ఫర్నీచర్ వివాదంలో అభియోగాలను ఎదుర్కొంటున్న టిడిపి నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ను ఉద్దేశించి వైసిపి పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ తన దైన శైలిలో సినిమా పాటల సాయంతో వ్యంగ్యంగా విమర్శించారు.
‘నీ ఇల్లు బంగారం కాను
మా అసెంబ్లీ సింగారం గాను
జోరు మీద ఉన్నావు, మూట కడతావా
మురిపాల మంచం, కంచం, కుర్చీ అన్ని కూడపెడతావా !! దొంగలకు దొంగ, రాజాధి రాజ
సత్తెనపల్లి సామ్రాట్, నరసరావుపేట నవాబ్ !!
కాస్త దిష్టి తీయించన్నా, నజర్ తగులుతుంది.’ అంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు.