తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BJP: బీజేపీ ఆ విష‌యంలో కేసీఆర్‌ను వ‌దిలిపెట్ట‌ట్లేదుగా!

Share

BJP: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను రాజ‌కీయ విమ‌ర్శ‌ల ప‌రంగా బీజేపీ టార్గెట్ చేసిన సంగ‌తి తెలిసిందే. గులాబీ ద‌ళ‌ప‌తి నిర్ణ‌యాల‌పై బీజేపీ విరుచుకుప‌డుతోంది. తాజాగా సీఎం కేసీఆర్ ప్ర‌తిష్టాత్మ‌క ప‌థ‌కం ద‌ళిత బంధు విష‌యంలోనూ విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. ఈ స్కీం గురించి మాజీమంత్రి, బీజేపీ నేత బాబూమోహన్ స్పందిస్తూ, దళితులకు భిక్షం కాదు.. మూడెకరాల భూమి ఇవ్వాలని.. అలా అయితేనే దళితులందరికీ న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.

Read More: KCR: కేసీఆర్‌కు హుజురాబాద్ భ‌యం ప‌ట్టుకుంది.. . దానికి ఉదాహ‌రణ ఇదే!

అంద‌రికీ ప‌ది ల‌క్ష‌లు…
బీజేపీ రాష్ట్ర కార్యాల‌యంలో నిర్వ‌హించిన విలేక‌రుల సమావేశంలో బాబుమోహ‌న్ మాట్లాడుతూ హుజురాబాద్ మాదిరి రాష్ట్రంలోని దళితులందరకీ పది లక్షలు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అందరికీ ఇస్తేనే దళితులపై కేసీఆర్ కు నిజమైన ప్రేమ ఉన్నట్లు అని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీల నిధులు మళ్లించబోమని అసెంబ్లీలో ఇచ్చిన మాటను కేసీఆర్ తప్పారని బాబు మోహన్ విమర్శించారు. దళిత బంధు కాదు‌… దళితుల బతుకులు బంద్ చేయటమే కేసీఆర్ టార్గెట్ అని ఆయన ఆరోపించారు. ఏడేళ్ల కాలంలో ఎస్సీ‌ ఎస్టీలకు కోసం ఎంత ఖర్చు చేశారో చెప్పాలన్నారు.

Read More: KCR: కేసీఆర్ నోటి వెంట ఆ మాట త‌ప్ప మ‌రోటి రావ‌ట్లేదుగా…

ఎమ్మెల్యేలు చ‌నిపోతేనే…

హుజురాబాద్ లో టీఆర్ఎస్ ఓటమి ఖాయమైన నేపథ్యంలోనే దళిత బంధు పథకం తీసుకొచ్చారని బాబు మోహ‌న్‌ విమర్శించారు. దళితులకు బిస్కెట్లు వేయటం‌ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తగదని, బిక్షం కాదు.. మాకు మాడెకరాల భూమి ఇస్తేనే న్యాయం జరుగుతుందన్నారు. ఏడేళ్ల తర్వాత కేసీఆర్ కు దళితులపై ప్రేమ కల్గినందుకు సంతోషం అన్నారు. హుజురాబాద్ లో ఈటల రాజేందర్ గెలవటం ఖాయమని తేలిపోయిందని, టీఆర్ఎస్ ఇచ్చే డబ్బులు తీసుకుని ఓటు మాత్రం న్యాయం, ధర్మానికి వేయాలని బాబు మోహన్ కోరారు. ఎమ్మెల్యేలు చనిపోయి ఉపఎన్నిక వస్తే తప్ప నియోజకవర్గాలు అభివృద్ధి చెందని పరిస్థితిని కేసీఆర్ తీసుకొచ్చారని బాబు మోహన్ ఆందోళన వ్యక్తం చేశారు.


Share

Related posts

Job Notification : హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నోటిఫికేషన్..

bharani jella

రాష్ట్రంలో అందరూ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి’ జగన్ సంచలన ప్రకటన… అందులో ఏముంది?

Yandamuri

Review : రివ్యూ – ‘చావు కబురు చల్లగా’ ఫస్ట్ హాఫ్

siddhu