NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu Arrest: జనసేనతోనే బీజేపీ పొత్తు .. డైలమాలో టీడీపీ..?

Chandrababu Arrest: తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్ధుల ఎంపిక, ప్రచార పర్వంలో ముందంజలో ఉన్నాయి. జనసేన పార్టీ కూడా పోటీకి సిద్దమయ్యింది. జనసేన ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉండటంతో బీజేపీ నేతలు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపారు. దాదాపు 32 స్థానాల్లో పోటీ చేయాలని తొలుత జనసేన భావించినా పొత్తులో భాగంగా అయితే 20 స్థానాలు అడుగుతున్నట్లు తెలుస్తొంది. పది నుండి 12 స్థానాలు కేటాయించడానికి బీజేపీ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తొంది. ఇరు పార్టీల నేతల మధ్య మరో సారి చర్చలు జరిగితే ఏదో ఓ విధంగా అవగాహన కుదిరే అవకాశం ఉంది.

టీడీపీ మాత్రం ఇంత వరకూ అభ్యర్ధుల ఎంపిక జరగలేదు. దీంతో ఈ సారి ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసే అవకాశం లేదనీ, బీజేపీకి మద్దతు ఇస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. ఇటీవలే 80కిపైగా స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందని తెలంగాణ టీడీపీ నేతలు ప్రకటించారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్  జైలులో ఉన్న పార్టీ అధినేత చంద్రబాబును తెలంగాణ పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కలిసి వచ్చారు. నందమూరి బాలకృష్ణ కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీ టీడీపీ నేతలతో సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొంటానని చెప్పారు. ఆ తర్వాత ఆయన మళ్లీ సినిమా బిజీలో పడిపోయారు. మరల పార్టీ ఆఫీసుకు వచ్చిన దాఖలాలు లేవు. ఆ తర్వాత ఒక అడుగు ముందుకు పడలేదు.

ఏపీలో జనసేన – టీడీపీ పొత్తులో ఉన్నా తెలంగాణలో ఈ పొత్తును కొనసాగించే ఆలోచనలో రెండు పార్టీలు లేవు. బీజేపీతో కలిసి జనసేన పయనిస్తొంది. ఆంధ్రప్రదేశ్ లో జనసేనతో పొత్తులో ఉండటంతో తెలంగాణలో జనసేన పోటీ చేసే స్థానాల్లో టీడీపీ మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుందని అంటున్నారు. బీజేపీ వ్యూహాత్మకంగా కాస్తోకూస్తో టీడీపీ బలంగా ఉన్న స్థానాలనే జనసేనకు కేటాయించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏపీలో జనసేనతో పొత్తు ఉండటంతో చంద్రబాబు ఆ స్థానాల్లో అభ్యర్ధులను పోటీకి దింపే అవకాశం ఉండదు.

తెలంగాణలో టీడీపీ పోటీ చేయదని జరుగుతున్న ప్రచారాన్ని ఆ పార్టీ నేత ఒకరు ఖండించారు. పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ దీనిపై స్పందించలేదు కానీ టీ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఆరిఫ్ మంగళవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించి జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. టీడీపీ కార్యకర్తలు, నాయకుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కొందరు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఇంతకు ముందే స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఇప్పటికే ఆశావహుల నుండి అప్లికేషన్ లు తీసుకున్నామన్నారు. త్వరలోనే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల వివరాలను ప్రకటిస్తామన్నారు.

తమ అధినాయకుడు చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైలులో ఉంచారన్నారు. ములాఖత్ లో ఆయనను కలిసిన తర్వాత అభ్యర్దుల విషయంపై స్పష్టత ఇస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ బలపడితే తాము ఎక్కడ దెబ్బతింటామోనని భయపడి కొన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీపై వదంతులు సృష్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ నేరుగా ప్రకటన చేయకపోవడంతో అనుమానాలు కొనసాగుతున్నాయి. బీజేపీ పొత్తుతో జనసేన పోటీ చేసే స్థానాలు వెల్లడైన తర్వాతనే టీడీపీ నుండి పోటీ చేసే అభ్యర్ధులపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అటు పార్టీ అధినేత చంద్రబాబు జైల్ లో ఉండటం, బీజేపీతో తలపడే పరిస్థితిలో లేకపోవడంతో టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తుందా లేక బేషరతుగా జనసేన, బీజేపీకి మద్దతు ఇస్తుందా అనేది తెలియాలి అంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.

Telangana Assembly Polls: కాంగ్రెస్ నుండి గ్రీన్ సిగ్నల్స్.. బీజేపీకి బైబై చెప్పేందుకు సిద్దమవుతున్న ఇద్దరు కీలక నేతలు..?

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?