NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: కాంగ్రెస్ అధిష్టానం నుండి వైఎస్ షర్మిలకు పిలుపు.. ఈ భేటీలో అయినా విలీన ప్రక్రియ ఫైనలైజ్ అయ్యేనా..?

Share

YS Sharmila: వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుండి పిలుపు వచ్చింది. పార్టీ విలీనంపై తాత్సారం జరుగుతున్న నేపథ్యంలో ఇటీవల వైఎస్ఆర్ టీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించిన వైఎస్ షర్మిల .. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అల్టిమేటమ్ జారీ చేశారు. సెప్టెంబర్ 30వ తేదీ లోగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విలీనానికి సంబంధించి ప్రతిపాదన ఫైనల్ చేయకపోతే ఒంటరిగానే వైఎస్ఆర్ టీపీ పోటీ చేస్తుందనీ, రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోటీకి పార్టీ సిద్దంగా ఉందని వెల్లడించారు. అక్టోబర్ రెండో వారం నుండి ప్రజల మధ్యే ఉండేలా కార్యచరణ చేపడతామని తెలిపారు.

YS Sharmila

దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అప్రమత్తమైంది. షర్మిల పార్టీ ఒంటరిగా 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్ధుల విజయావశాకాలపై ప్రభావం పడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు నిన్న రంగంలోకి దిగారు. షర్మిలతో సంప్రదింపులు జరిపి పార్టీ అధిష్టానం పెద్దలతో మాట్లాడించారు. ఈ సందర్భంలో ఢిల్లీకి రావాల్సిందిగా కాంగ్రెస్ పెద్దలు షర్మిలను ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో విలీన ప్రతిపాదనలకు వైఎస్ షర్మిల సానుకూలత వ్యక్తం చేసినా ఆమె చేసిన డిమాండ్ లపైనే పార్టీ అధిష్టానం ఎటూ తేల్చుకోలేక తాత్సారం చేస్తుందని అంటున్నారు.

YS Sharmila

షర్మిల సేవలను ఆంధ్రప్రదేశ్ లో ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుండగా, షర్మిల మాత్రం తన రాజకీయం తెలంగాణకే అన్నట్లుగా భీష్మించుకుని కూర్చున్నారని సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ లో షర్మిల పెత్తనం చేయడాన్ని మొదటి నుండి రేవంత్ రెడ్డి, ఆయన వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడే పీట ముడి పడింది. పాలేరు అసెంబ్లీ సీటు విషయంలో షర్మిల అంతగా పట్టుపట్టకపోయినా ఇతర డిమాండ్ల విషయంలో వెనక్కు తగ్గడం లేదు. పార్టీ పెద్దల ఆహ్వానం మేరకు సోమ లేదా మంగళవారాల్లో షర్మిల ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం.

పాలేరు అసెంబ్లీ సీటు అవకాశం లేకపోతే ఖమ్మం లేదా సికింద్రాబాద్ పార్లమెంట్ సీటు ఇవ్వాలన్న ప్రతిపాదన ఆమె చేసే అవకాశం ఉందని వైఎస్ఆర్టీపీ వర్గాలు అంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరణంలో ఈ వారంలోనే షర్మిల పార్టీ విలీనానికి సంబంధించి ఫైనల్ చర్చలు జరపాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. చూడాలి ఏ విధంగా పార్టీ అధిష్టానం షటిల్ చేస్తుందో..!

Chandrababu Arrest: చంద్రబాబు క్వాష్ పిటిషన్ .. సుప్రీం కోర్టులో ఆ బెంచ్ ముందుకు..


Share

Related posts

Bandla Ganesh: నరేష్ పై మండిపడ్డ బండ్ల గణేష్..!!

sekhar

బ్రేకింగ్: ఉన్నత విద్య ప్రవేశ పరీక్ష తేదీలను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

Vihari

New Couple: కొత్త దంపతులు  కలిసి మొదట సారి  భోజనం చేసే సందర్భం లో   ఆ ప్రదేశం లో ఇలా చేయండి!!

siddhu