NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని దీప్తి అనుమానాస్పద మృతిలో వీడిన మిస్టరీ .. ప్రియుడితో కలిసి దీప్తిని హత్య చేసింది చెల్లెలు చందనే.. వివరాలు వెల్లడించిన జగిత్యాల ఎస్పీ బాస్కర్

జగిత్యాల జిల్లా కోరుట్లలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దీప్తి కేసులో మిస్టరీ వీడింది. దీప్తిని హత్య చేసింది ఆమె సోదరి చందనేననీ, ఆమెకు ప్రియుడు సహకరించారని పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో చందనతో పాటు ఆమె ప్రియుడు షేక్ సుల్తాన్, వారికి సహకరించిన నిందితులను పోలీసులు అరెస్టు చేసారు. కోరుట్లలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దీప్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం, ఆమె చెల్లెలు చందన బాయ్ ప్రెండ్ తో ఇంట్లో నుండి జంప్ కావడంతో పాటు ఇంట్లో ఉన్న నగలు, నగదు కూడా లేకపోవడంతో అనుమానాలు అన్నీ చందన, ఆమె బాయ్ ప్రెండ్ మీదకే వెళ్లాయి. ఘటన తర్వాత చందన బెంగళూరులో ఉన్న తన సోదరుడికి వాయిస్ మేసేజ్ పెట్టింది. తాను అక్కను చంపలేదనీ, ఆ అవసరం తనకు లేదని, తాను తన స్నేహితులతో ఇంటికి మందు తెప్పించి అక్క నేను తాగామనీ, ఆ తర్వాత అక్క మత్తుగా పడుకోవడంతో తాను బాయ్ ఫ్రెండ్ తో వెళ్లిపోయినట్లుగా పేర్కొంది.

ఆ తర్వాత పోలీసులు బస్టాండ్ లో సీసీ టీవీ పుటేజీ పరిశీలించగా, వేకువజామున బస్టాండ్ చందన కొద్ది సేపు స్నేహితుడితో ఉందని ఆ తర్వాత బస్సు ఎక్కినట్లు రికార్డు అయ్యింది. ఆమె సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా చందనను పట్టుకునేందుకు అయిదు ప్రత్యేక టీమ్ లను పోలీసు అధికారులు రంగంలోకి దించారు. దీప్తి హత్య కేసులో ముందు నుండి అనుమానిస్తున్నట్లు దీప్తి చెల్లెలు చందనే తన బాయ్ ప్రెండ్ తో కలిసి హత్య చేసినట్లుగా తేలిందని జిల్లా ఎస్పీ భాస్కర్ తెలిపారు. శనివారం ఉదయం నిందితులను అర్మూర్ – బాల్కొండ రూట్ లో కారులో వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కేసుకు సంబందించిన వివరాలను వెల్లడించారు.

బంకా చందనకు హైదరాబాద్ లోని ఇంజనీరింగ్ కళాశాలలో ఉమర్ షేక్ సుల్తాన్ అనే యువకుడు పరిచయం అయ్యాడనీ, ఆ తర్వాత వారి మద్య ప్రేమ మొదలైందన్నారు. పెళ్లి చేసుకుందామని అనుకున్నారనీ, అయితే చందన పెళ్లి ప్రపోజల్ తీసుకురాగా, సెటిల్ కాకుండా పెళ్లి వద్దనీ, మ్యారేజ్ చేసుకుంటే డబ్బు అవసరమవుతుందని చెప్పాడు. అయితే చందన ఇంట్లోని నగలు, నగదు తీసుకువెళ్లి ఉమర్ ను వెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యింది. ఈ క్రమంలో తన తల్లిదండ్రులు హైదరాబాద్ వెళ్లడంతో ఉమర్ కు ఇంటికి పిలిపించుకుంది. తన ప్లాన్ లో భాగంగా గత నెల 28వ తేదీ రాత్రి చందన .. తన అక్కకు వోడ్కాతో పాటు బ్రీజర్ తెప్పించింది. రాత్రి ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. దీప్తి పడుకున్న తర్వాత ఇంటి సమీపంలో ఉన్న ఉమర్ ను చందన ఫోన్ చేసి పిలిపించింది.

ఇద్దరు కలిసి ఇంట్లో ఉన్న డబ్బు, ఆభరణాలు తీసుకుని బయటకు వెళ్లే ప్రయత్నంలో ఉండగా దీప్తికి మెలుకువ వచ్చి అరవడంతో చందన తన స్కార్ప్ తో దీప్తి మూతికి, ముక్కును గట్టిగా అదిమిపట్టింది.  దీంతో దీప్తి సోఫా మీద పడిపోయింది. ఆ తర్వాత ఉమర్, చందన కలిసి మరో స్కార్ఫ్ తో దీప్తి చేతులు కట్టేశారు. ఆయినా ఆమె అరుస్తుండటంతో ప్లాస్టర్ ను ఆమె మూతికి, ముక్కుకి వేశారు. దీంతో ఊపిరాడక పది నిమిషాల్లోనే దీప్తి చలనం కోల్పోయింది. దీప్తి వోడ్కా తాగి చనిపోయి ఉంటుందని మభ్యపెట్టేందుకు వారు వెళ్లే సమయంలో ఆమె నోటికి ఉన్న స్కార్ఫ్, ప్లాస్టర్ తీసేశారు. అక్కడ నుండి హైదరాబాద్ ఉమర్ వాళ్ల ఇంటికి వెళ్లారు. అక్కడ ఉమర్ తన వాళ్లను తీస్కొని ముంబాయి లేదా నాగ్ పూర్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. సాంకేతిక సహకారంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

BJP: బిగ్ బ్రేకింగ్ : లోక్ సభ రద్దు ? సంచలన నిర్ణయం దిశగా మోడీ !

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju