NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BRS: కెసిఆర్ ఇంటి ముందర సర్పంచ్ నవ్య ధర్నా ? ఉలిక్కిపడ్డ తెలంగాణా !

Advertisements
Share

అధికార పార్టీ శాసనసభ్యుడిపైనే సంచలన ఆరోపణలు చేసి తెలంగాణ వ్యాప్తంగా ఒకే ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న బీఆర్ఎస్ సర్పంచ్ నవ్య గురించి అందరికీ తెలిసిందే. వరుసగా నాలుగు సార్లు స్టేషన్ ఘన్ పూర్ BRS: నుండి ఎమ్మెల్యే గా గెలిచిన తాడికొండ రాజయ్య రాజకీయ భవిష్యత్తు ఆమె ఆరోపణతో మసకబారింది. ఎమ్మెల్యే రాజయ్యపై సర్పంచ్ నవ్య చేసిన లైంగిక ఆరోపణలపై తన వద్ద ఆధారాలు ఉన్నాయంటూ పంచాయతీ పెట్టడం, గ్రామాభివృద్ధికి లక్షలాది రూపాయలు నిధులు రాబట్టడం తెలిసిందే. ఈ వివాదం నేపథ్యంలో ఇటీవల ముఖ్యమంత్రి కేసిఆర్ జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్ధుల జాబితాలో రాజయ్యను పక్కన పెట్టేశారు.

Advertisements

ఈ నియోజకవర్గం నుండి సీటు ఆశించిన సీనియర్ నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరికి కేసిఆర్ అవకాశం కల్పించారు. అభ్యర్ధుల ప్రకటనకు ముందు కడియం శ్రీహరి, రాజయ్య లు బహిరంగంగానే పరస్పరం విమర్శలు చేసుకున్నారు. వరుసగా నాలుగు సార్లు గెలిచిన రాజయ్యకు ఈ సారి టికెట్ లభించకపోవడానికి కారణంగా ఆయన ప్రవర్తనే కారణమనే మాటలు కూడా నియోజకవర్గంలో వినబడుతున్నాయి. ప్రధానంగా జానకీపురం మహిళా సర్పంచ్ నవ్య ఎపిసోడ్ యే కారణమని అందరూ అనుకుంటున్నారు. సీఎం కేసిఆర్ ప్రకటించిన తొలి జాబితాలో టికెట్ లభించకపోవడంతో రాజయ్య తీవ్ర ఆవేదన చెందుతూ ఇటీవల కన్నీరు కూడా పెట్టుకున్నారు.

Advertisements

అయితే రాజయ్యకు టికెట్ నిరాకరించడాన్ని ఎంఆర్పీఎస్ తప్పుబడుతోంది. రాజయ్యను తప్పిస్తే అదే సామాజికవర్గానికి చెందిన మాదిగ బిడ్డకే టికెట్ ఇవ్వాలని మందా కృష్ణమాదిగ డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో రాజయ్యకు పదవి పోవడానికి కడియం శ్రీహరే కారణం అంటూ కూడా ఆరోపణలు చేశారు మంద కృష్ణమాదిగ. కడియం శ్రీహరికి టికెట్ ప్రకటించినంత మాత్రాన బీఫాం ఇవ్వాలి కాదా ఎలా ఇస్తారో చూస్తానంటూ కూడా మంద కృష్ణమాదిగ ఛాలెంజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రాజయ్యపై ఆరోపణలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సర్పంచ్ నవ్య తనకు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని సీఎం కేసిఆర్ ను రిక్వెస్ట్ చేస్తూ వీడియో విడుదల చేయడం సంచలనం అయ్యింది.

బీఆర్ఎస్ లో సీఎం కేసిఆర్, మంత్రి కేటిఆర్ తనకు అవకాశం ఇస్తే మీ ఆశీస్సులతో స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గా నామినేషన్ వేయడానికి సిద్దంగా ఉన్నట్లు సర్పంచ్ నవ్య పేర్కొన్నారు. ఇప్పుడు వీడియో విడుదల చేసిన సర్పంచ్ నవ్య రాబోయే రోజుల్లో స్టేషన్ ఘన్ పూర్ టికెట్ కోసం కేసిఆర్ ఇంటి ముందు ధర్నా చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. ఇదే జరిగితే స్టేషన్ ఘన్ పూర్ వ్యవహారం మరో సారి హాట్ టాపిక్ అవుతుంది.

ఏపీలో ఎస్ఐ అభ్యర్ధులకు అలర్ట్ .. ఫైనల్ పరీక్షలకు షెడ్యుల్ విడుదల ..ఎప్పుడంటే..

 


Share
Advertisements

Related posts

బాబుపై రాజ ద్రోహం కేసు పెట్టాలి

sarath

Eatlea Rajendar: బీజేపీలోకి ఈట‌ల ముహుర్తం ఎప్పుడంటే…

sridhar

మోత్కుపల్లికి తీవ్ర అస్వస్థత

Siva Prasad